తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mp Elections 2023: ఐపీఎల్ టీమ్, ఓపీఎస్, రైతు రుణ మాఫీ, కుల గణన.. మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ మేనిఫెస్టో

MP Elections 2023: ఐపీఎల్ టీమ్, ఓపీఎస్, రైతు రుణ మాఫీ, కుల గణన.. మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ మేనిఫెస్టో

HT Telugu Desk HT Telugu

17 October 2023, 18:27 IST

google News
  • MP Elections 2023: మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలో కులగణన, రాష్ట్రానికి ఐపీఎల్ టీమ్, రైతు రుణాల మాఫీ.. మొదలైన హామీలను పొందుపర్చింది.

మేనిఫెస్టోను విడుదల చేస్తున్న కాంగ్రెస్ నాయకులు
మేనిఫెస్టోను విడుదల చేస్తున్న కాంగ్రెస్ నాయకులు (PTI)

మేనిఫెస్టోను విడుదల చేస్తున్న కాంగ్రెస్ నాయకులు

MP Elections 2023: మధ్య ప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఒక్క పార్టీ తమ మేనిఫెస్టో (Congress manifesto) లను ప్రకటిస్తున్నాయి. తాజాగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అమలు చేస్తామని చెబుతూ పలు ఎన్నికల హామీలను తమ మేనిఫెస్టోలో పొందుపర్చింది. 230 స్థానాల మధ్య ప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి.

కాంగ్రెస్ హేమాహేమీల ప్రచారం..

సీనియర్ నేత కమల్ నాథ్ నాయకత్వంలో మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పోరాటంలో దిగుతోంది. రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు ఢిల్లీ నుంచి సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే.. తదితరులు ప్రచారంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో మంగళవారం పార్టీ మేనిఫెస్టో (Congress manifesto) ను విడుదల చేశారు.

ఎన్నికల హామీలు ఇవే..

మొత్తం 106 పేజీల మేనిఫెస్టోలో రాష్ట్రంలోని అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మొత్తం 59 ఎన్నికల హామీలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అందులో ముఖ్యమైన హామీలు..

  • రూ. 25 లక్షల ఆరోగ్య బీమా
  • రూ. 10 లక్షల ప్రమాద బీమా
  • రూ. 2 లక్షల వరకు రైతు రుణ మాఫీ
  • రూ. 500లకే గ్యాస్ సిలండర్
  • రాష్ట్రం కోసం ప్రత్యేక ఐపీఎల్ టీమ్
  • రైతుల నుంచి వరిని క్వింటాల్ కు రూ. 2500 లకు, గోధుమలను క్వింటాల్ కు రూ. 2600 లకు కొనుగోలు
  • 100 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగం ఉచితం. ఆపై 200 యూనిట్ల వరకు సగం ధరకే కరంటు సరఫరా.
  • మహిళలకు నెలకు రూ. 1500.
  • పఢో.. పఢావో పథకం కింద 1వ తరగతి నుంచి 8 వ తరగతి వరు విద్యార్థులకు రూ. 500., 9వ తరగతి, 10వ తరగతి పిల్లలకు రూ. 1000, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు రూ. 1500 చెల్లింపు.
  • పాత పెన్షన్ పథకం అమలు
  • చదువుకున్న అర్హులైన నిరుద్యోగులకు రెండేళ్ల పాటు నెలకు రూ. 1500 నుంచి రూ. 3000 వరకు నిరుద్యోగ భృతి
  • పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలకు రూ. 1.01 లక్షల వరకు ఆర్థిక సాయం.
  • 3% వడ్డీకి మహిళా వ్యాపారులకు రూ. 25 లక్షల వరకు రుణం.
  • రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన

తదుపరి వ్యాసం