Congress Manifesto: మహిళలకు పెళ్లి కానుకగా 10గ్రాముల బంగారం ఇచ్చే యోచనలో టీ కాంగ్రెస్
Congress Manifesto: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ పార్టీ మహిళలకు మరో తాయిలం ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే మహాలక్ష్మీ పేరుతో పలు పథకాలు ప్రకటించిన కాంగ్రెస్, పెళ్లి కానుకగా బంగారాన్ని ఇచ్చే అంశాన్ని చేర్చాలని యోచిస్తోంది.
Congress Manifesto: తెలంగాణ ఎన్నికల్లో మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ మరో తాయిలం ప్రకటించేందుకు రెడీ అవుతోంది. కర్ణాటక తరహాలో మహిళలకు పలు స్కీములు ప్రకటించిన కాంగ్రెస్, అర్హత ఉన్న యువతులకు పెళ్లి కానుకగా పది గ్రాముల బంగారాన్ని వివాహ సమయంలో కానుకగా ఇవ్వాలని యోచిస్తోంది.
తెలంగాణలో ఎన్నికల హడావుడి సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల కోసం కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో కొత్త హామీని చేర్చాలని ఆలోచిస్తోంది.కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించిన 'మహాలక్ష్మి'స్కీములోనే మరో పథకాన్ని చేర్చాలని యోచిస్తోంది.అర్హత ఉన్న మహిళలకు వారి వివాహ సమయంలో 10 గ్రాముల బంగారాన్ని అందించాలని యోచిస్తున్నట్టు పార్టీ నాయకులు తెలిపారు.
తెలంగాణలో ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో మరో కీలక హామీని చేర్చాలని భావిస్తోంది. 'మహాలక్ష్మి' గ్యారెంటీ కింద, అర్హత ఉన్న యువతులకు వివాహ సమయంలో 10 గ్రాముల బంగారాన్ని అందించాలని భావిస్తున్నారు.
ఈ ప్రతిపాదనకు సంబంధించి పార్టీ సీనియర్ నేతలతో చర్చలు కొనసాగుతున్నాయని, ‘మహాలక్ష్మి’ హామీ ద్వారా వధువు కుటుంబానికి రూ.లక్ష సాయం అందించాలనే సంకల్పంతో పాటు, బంగారాన్ని కూడా జతచేసే ఆలోచనలో ఉన్నట్లు తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్‌బాబు తెలిపారు.దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని,ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీతో పాటు ఏఐసిసి స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.
మహిళలకు నెలకు 2,500 నగదు సాయం, రూ.500కే ఎల్పీజీ సిలిండర్‌తో పాటు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి హామీ ఇచ్చే ‘మహాలక్ష్మి’ పథకాన్ని కాంగ్రెస్ గతంలో ప్రవేశపెట్టింది.మహాలక్ష్మీపథకం ప్రకటనతో మహిళా ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు మహాకూటమి ప్రయత్నిస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,06,42,333, ఇందులో 1,53,73,066 మంది పురుషులు మరియు 1,52,51,797 మంది మహిళా ఓటర్లు, మిగిలిన ఓటర్లు థర్డ్ జెండర్‌కు చెందినవారు ఉన్నారు.
ప్రస్తుతం తెలంగాణలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని భారత్ రాష్ట్ర సమితి ప్రభుత్వం 'కల్యాణలక్ష్మి' పథకాన్ని అందిస్తోంది. కళ్యాణలక్ష్మి పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కుటుంబాలకు చెందిన నూతన వివాహితలకు ఆర్థిక సహాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ పథకం ద్వారా పెళ్లి సమయంలో వధువుకు ఆర్థిక సహాయం తల్లి బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేస్తున్నారు. దీనికంటే మెరుగ్గా బంగారాన్ని కానుకగా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. తెలంగాణ అసెంబ్లీకి నవంబర్ 30న ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.
తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, అధికార భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ మధ్య ముక్కోణపు పోటీ నెలకొననుంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో, BRS 119 స్థానాలలో 88 స్థానాలను గెలుచుకో గలిగింది. గత ఎన్నికల్లో 47.4 శాతం ఓట్ల వాటాను కలిగి ఉంది. కాంగ్రెస్ పార్టీ 19 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది.