తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News : కొడుకు చేసుకున్న పెళ్లి ఇష్టం లేక.. కోడలిని చంపించిన అత్త!

Crime news : కొడుకు చేసుకున్న పెళ్లి ఇష్టం లేక.. కోడలిని చంపించిన అత్త!

Sharath Chitturi HT Telugu

09 September 2023, 12:58 IST

google News
  • Noida Crime news : కొడుకు చేసుకున్న పెళ్లి ఇష్టం లేకపోవడంతో.. కోడలిని చంపించింది ఓ మహిళ. ఈ ఘటన నోయిడాలో వెలుగులోకి వచ్చింది.

కొడుకు చేసుకున్న పెళ్లి ఇష్టం లేక.. కొడలిని చంపించిన అత్త!
కొడుకు చేసుకున్న పెళ్లి ఇష్టం లేక.. కొడలిని చంపించిన అత్త!

కొడుకు చేసుకున్న పెళ్లి ఇష్టం లేక.. కొడలిని చంపించిన అత్త!

Mother-in-law kills woman : నోయిడాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కొడుకు చేసుకున్న పెళ్లి ఇష్టం లేకపోవడంతో, కోడలిని చంపించింది ఓ మహిళ. పోలీసులు ఈ కేసును 72గంటల్లోనే ఛేజ్​ చేశారు.

ఇదీ జరిగింది..

నోయిడాలోని బ్రిజ్​ విహార్​ కాలనీలో ఈ ఘటన జరిగింది. సోనీ అనే 27ఏళ్ల మహిళ.. మౌసమ్​ కుమార్​ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. కాగా.. ఈ నెల 5న సోనీ ఒంటరిగా ఉన్న సమయంలో.. ఇద్దరు దుండగులు ఆమె ఇంట్లోకి చొరబడ్డారు. మహిళను తుపాకీతో కాల్చి చంపేశారు. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించాడు మౌసమ్​ కుమార్​. సోనీ మొదటి భర్తే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటాడని ఫిర్యాదు చేశారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు.

"ఘటనపై సమాచారం అందిన వెంటనే.. సీనియర్​ అధికారులు ఘటనాస్థలానికి వెళ్లారు. దర్యాప్తు చేపట్టారు. నాలుగు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు," అని అధికారులు వెల్లడించారు.

woman kills daughter in law : ఈ క్రమంలోనే స్థానికంగా ఇన్ఫార్మర్​ అందించిన టిప్​తో.. శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఇద్దరిని అరెస్ట్​ చేశారు పోలీసులు. వీరి పేర్లు సచిన్​, ఉమేశ్​. వీరే.. సోనీని చంపినట్టు ధ్రువీకరించారు. వీరిని విచారించగా.. అసలు విషయం బయటపడింది.

కొడుకు దూరమయ్యాడని..!

మౌసమ్​ కుమార్​ కుటుంబం ఘజియాబాద్​లో నివాసముంటోంది. సోనీని పెళ్లి చేసుకోవడం మౌసమ్​ కుమార్​ తల్లిదండ్రులకు ఇష్టం లేదు. వారి మాటలు వినకుండా ఆమెను పెళ్లి చేసుకుని నోయిడాకు వెళ్లిపోయాడు. అతను ఎక్కడ ఉంటున్నాడు అన్న విషయం కూడా చెప్పలేదు. ఈ క్రమంలో అతడి తల్లికి కోపం వచ్చింది. బిడ్డ తమని చూసుకోవడం లేదని బాధ కలిగింది. చివరికి.. కోడలిని చంపాలని ఆ 45ఏళ్ల మహిళ నిర్ణయించుకుంది. ఇందుకోసం ఇద్దరు షూటర్లకు రూ.1లక్ష డబ్బులు ఇచ్చింది. చివరికి.. సోనీని చంపించేసింది.

మూడో మహిళ పాత్ర ఉందని తెలుసుకున్న పోలీసులు.. శుక్రవారమే ఆమెను కూడా అరెస్ట్​ చేశారు. విచారణలో.. సంబంధిత మహిళ నిజాన్ని ఒప్పుకుంది.

Mother-in-law kills woman : ఇలా.. 72గంటల్లో లోపే, పోలీసులు ఈ కేసును సాల్వ్​ చేశారు. ఇందుకోసం కష్టపడిన సిబ్బందికి రూ. 25వేల రివార్డును ప్రకటించింది పోలీసుశాఖ.

నిందితుడు కాలికి గాయం..

దర్యాప్తులో భాగంగా.. సోనీని కాల్చిన తుపాకీ ఎక్కడుందని షూటర్స్​ను ప్రశ్నించారు పోలీసులు. దురియా గిర్దార్​ఫుర్​ గ్రామం వద్ద పడేశామని చెప్పారు. నిందితులను తీసుకుని పోలీసులు అక్కడికి వెళ్లారు. ఘటనాస్థలంలో తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. కానీ సచిన్​ తిరగబడ్డాడని, ఎస్​ఐపై కాల్పులు జరిపాడని అధికారులు చెప్పారు. ఆత్మరక్షణ కోసం.. పోలీసు, సచిన్​ కాలుపై కాల్చినట్టు వెల్లడించారు.

తదుపరి వ్యాసం