Aitana AI : నెలకు రూ. 3లక్షలు సంపాదిస్తున్న 'ఏఐ' మోడల్..!
26 November 2023, 11:10 IST
Aitana AI Spain : ఈ ఫొటోలో ఉన్నది ఒక మోడల్. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. తను అమ్మాయి కాదు. ఒక ఏఐ మోడల్! అసలు విషయం ఏంటంటే..
నెలకు రూ. 3లక్షలు సంపాదిస్తున్న 'ఏఐ' మోడల్..!
Aitana AI Spain : ఈ అమ్మాయి ఎవరు- చాలా అందంగా ఉంది! మోడలింగ్ చేస్తోందా? అని అనుకుంటున్నారా? అయితే మీ డౌట్స్ నిజమే! తను ఒక మోడల్. కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. ఆ మోడల్ అమ్మాయి కాదు. ఒక ఏఐ! స్పానిష్ డిజైనర్ రుబెన్ క్రూజ్, ఆయన కంపెనీ 'ది క్లూలెస్' కలిసి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో సృష్టించిందే ఈ మోడల్. పేరు ఐటానా! అంతేకాకుండా.. ఈ ఏఐ.. నెలకు రూ. 3లక్షల వరకు సంపాదిస్తుండటం విశేషం!
ఐటానా.. ఒక ఏఐ!
యూరోన్యూస్కు ఇటీవలే ఇంటర్వ్యూ ఇచ్చారు రుబెన్ క్రూజ్. ఐటానా గురించి పలు విషయాలను వెల్లడించారు.
"మా బిజినెస్‌లో వస్తున్న సమస్యలను లోతుగా పరిశీలించాము. మా చేతుల్లో లేని అంశాలతో చాలా నష్టపోతున్నామని గ్రహించాము. ఇన్ఫ్లుయెంజర్స్, మోడల్స్‌తో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. మనుషులు వారి ఈగోను డీల్ చేసే బదులు.. మాకంటూ ఒక ఏఐ ఉంటే బాగుండు అనిపించింది. సింపుల్‌గా పోజ్లిస్తూ.. మాకు డబ్బులు తెచ్చిపెట్టే విధంగా ఉండాలని భావించాము. అలా.. ఐటానాను సృష్టించాము," అని రుబెన్ క్రూజ్ తెలిపారు.
Aitana AI robot : ఇదే విషయంపై ది క్లూలెస్ సంస్థ సహ-వ్యవస్థాపకురాలు డయానా న్యూనెజ్ మాట్లాడారు.
"మోడల్స్, ఇన్ఫ్లుయెంజర్స్పై మేము చేస్తున్న ఖర్చు చాలా పెరిగిపోయింది. అప్పుడే మాకు ఒక ఐడియా వచ్చింది. మాకు మేము ఒక మోడల్ని సృష్టించుకుంటే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన వచ్చింది. అందంగా ఉండాలి అని అనుకున్నాము. అంతే! ఈ ఐటానా పుట్టుకొచ్చింది. ప్రయోగాలకు, వివిధ లుక్స్‌ని ట్రై చేసేందుకు కాస్త సమయం పట్టింది. ఆ తర్వాత.. జాక్‌పాట్ కొట్టాము," అని డయానా తెలిపారు.
సూపర్ ఫాలోయింగ్..!
Aitana AI instagram : యూరోన్యూస్ రిపోర్ట్ ప్రకారం.. ఈ ఏఐ మోడల్ ఐటానా.. సగటున నెలకు 3వేల పౌండ్ల నుంచి 10వేల పౌండ్ల వరకు సంపాదిస్తోంది! అనేక కంపెనీలకు మోడల్‌గా వ్యవహరిస్తోంది.
అంతేకాకుండా.. ఐటానాకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఇన్‌స్టాలో తను చాలా ఫేమస్. ఇప్పటికే 1.21లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. చాలా మంది పర్సనల్‌గా మెసేజ్‌లు కూడా చేస్తూ ఉంటారు.