ట్రావెలింగ్ ప్రియులు తమ ఖర్చులను  తగ్గించుకునేందుకు కొన్ని క్రెడిట్ కార్డ్‌లు ఆఫర్లు అందిస్తాయి. హోటల్, ఫ్లైట్ టికెట్ బుకింగ్‌ వంటి వివిధ ప్రయాణ సంబంధిత ఖర్చులకు ఆఫర్లు ఇస్తాయి. రివార్డ్ పాయింట్లతో ఉచిత విమాన టికెట్లు లేదా హోటల్ లో స్టే కోసం రీడీమ్ చేసుకోవచ్చు.  

pexels

By Bandaru Satyaprasad
Nov 07, 2023

Hindustan Times
Telugu

 మరికొన్ని ట్రావెల్ క్రెడిట్ కార్డ్‌లు ట్రావెల్ పోర్టల్లపై డిస్కౌంట్‌లను ఇస్తున్నాయి. హోటల్ స్టే, ఎయిర్‌లైన్ లాయల్టీ ప్రోగ్రామ్‌లకు కాంప్లిమెంటరీ మెంబర్‌షిప్‌లను కూడా అందిస్తున్నాయి. ట్రావెల్ క్రెడిట్ కార్డుతో మీరు డబ్బు సేవ్ చేసుకునే కొన్ని మార్గాలు ఉన్నాయి. 

pexels

కో-బ్రాండెడ్ ట్రావెల్ క్రెడిట్ కార్డు- ప్రముఖ విమానయాన సంస్థలు లేదా ట్రావెల్ పోర్టల్‌ల సహకారంతో అనేక ట్రావెల్ క్రెడిట్ కార్డ్‌లు కస్టమర్లకు వివిధ ప్రయోజనాలు అందిస్తున్నాయి. ఈ కార్డ్‌లతో మీరు సులభంగా రివార్డ్ లను సంపాదించవచ్చు. వీటిని రీడీమ్ చేసుకోవచ్చు.   

pexels

ఈ కార్డులతో  చెక్-ఇన్, చెక్-ఇన్ బ్యాగేజీ అలవెన్స్, అధిక రివార్డు ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు. విస్తారా, ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్, ఎతిహాద్, ఇండిగో, ఎమిరేట్స్ వంటి విమానయాన సంస్థలు కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. ఈ కార్డులతో వార్షిక ఖర్చు్లో ఆదాతో పాటు నాలుగు ఉచిత విమాన టికెట్లు కూడా పొందవచ్చు. 

pexels

 ప్రముఖ హోటళ్లలో లాయల్టీ ప్రోగ్రామ్‌లకు కాంప్లిమెంటరీ మెంబర్‌షిప్ అందించే కార్డులు కూడా ఉన్నాయి. హోటళ్లలో కాంప్లిమెంటరీ స్టే లేదా డైరెక్ట్ డిస్కౌంట్‌లను పొందవచ్చు.

pexels

ట్రావెల్ సెంట్రిక్ రివార్డ్‌లను రీడీమ్- ట్రావెల్ క్రెడిట్ కార్డ్‌ల ద్వారా వచ్చే రివార్డు పాయింట్లు లేదా ఎయిర్ మైళ్ల ద్వారా డబ్బు మొత్తాన్ని ఆదా చేయడంలో మీకు సహాయపడతాయి. మీరు సంపాదించే పాయింట్‌ల సంఖ్య తక్కువగా అనిపించవచ్చు, కానీ ప్రయాణాల్లో రిడెంప్షన్ విలువ ఎక్కువగా ఉంటుంది.  

pexels

ట్రావెల్ క్రెడిట్ కార్డ్‌లు రివార్డ్ పాయింట్లు, ఎయిర్ మైల్స్ లేదా హోటల్ లాయల్టీ పాయింట్లకు బదిలీ చేసుకోవడానికి అనుమతిస్తాయి. ఇది సాధారణ క్రెడిట్ కార్డుల కంటే మెరుగైన ప్రయోజనాలు అందిస్తాయి. 

pexels

తరచుగా ప్రయాణించే వ్యక్తులు ట్రావెల్ క్రెడిట్ కార్డులు ద్వారా అదనపు ప్రయోజనాలు పొందవచ్చు. కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, ఎయిర్‌పోర్టులలో వీఐపీ మీట్-అండ్-గ్రీట్ సర్వీస్, లాయల్టీ ప్రోగ్రామ్‌లలో మెంబర్‌షిప్, ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు పొందవచ్చు.   

pexels

ఫ్రీ లాంజ్ యాక్సెస్‌, హోటల్ లాయల్టీ ప్రోగ్రామ్‌లో ఉచిత గది అప్‌గ్రేడ్‌లు, ముందస్తు చెక్-ఇన్, ఫ్రీ బ్రేక్ ఫాస్ట్ అందిస్తాయి. వీటితో పాటు ప్రయాణ బీమా కూడా ఉంటుంది.  

pexels

ట్రావెల్ క్రెడిట్ కార్డుల ద్వారా కాంప్లిమెంటరీ ఫ్లైట్ టికెట్లు, బోనస్ రివార్డు పాయింట్ లు లేదా డిస్కౌంట్ వోచర్‌లు లభిస్తాయి. వీటితో ప్రయాణికులు తమ ఖర్చును తగ్గించుకోవచ్చు.  

pexels

బెస్ట్ ట్రావెల్ క్రెడిట్ కార్డులు : క్లబ్ విస్తారా IDFC First క్రెడిట్ కార్డ్, యాక్సిస్ అట్లాస్ క్రెడిట్ కార్డ్, యాక్సిస్ బ్యాంక్ విస్తారా సిగ్నేచర్, ఎయిర్ ఇండియా SBI సిగ్నేచర్, ఇంటర్‌మైల్స్ HDFC సిగ్నేచర్, కోటక్ ఇండిగో XL క్రెడిట్ కార్డ్, ప్రామాణిక చార్టర్డ్ EaseMyTrip, యాత్ర SBI కార్డు, MakeMyTrip ICICI బ్యాంక్ సిగ్నేచర్, IRCTC SBI కార్డ్ ప్రీమియర్ 

pexels

చర్మం మెరుపును పెంచగల ఐదు రకాల పండ్లు

Photo: Pexels