తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Manish Sisodia: తీహార్ జైలుకు మనీశ్ సిసోడియా: జ్యుడిషియల్ కస్టడీ విధించిన కోర్టు

Manish Sisodia: తీహార్ జైలుకు మనీశ్ సిసోడియా: జ్యుడిషియల్ కస్టడీ విధించిన కోర్టు

06 March 2023, 15:40 IST

google News
    • Manish Sisodia: ఆమ్ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియాకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది ఢిల్లీలోని ఓ ప్రత్యేక కోర్టు. ఆయన తీహార్ జైలుకు వెళ్లనున్నారు.
Manish Sisodia: తీహార్ జైలుకు మనీశ్ సిసోడియా: జ్యుడిషియల్ కస్టడీ
Manish Sisodia: తీహార్ జైలుకు మనీశ్ సిసోడియా: జ్యుడిషియల్ కస్టడీ (ANI)

Manish Sisodia: తీహార్ జైలుకు మనీశ్ సిసోడియా: జ్యుడిషియల్ కస్టడీ

Manish Sisodia: లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia)కు ఓ ప్రత్యేక కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ (Judicial Custody) విధించింది. సీబీఐ కస్టడీ గడువు ముగియటంతో ఈ నెల 20వ తేదీ వరకు సిసోడియాను జ్యుడిషియల్ కస్టడీలో ఉంచాలని ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు సోమవారం నిర్ణయించింది. దీంతో ఆమ్ఆద్మీ పార్టీ నేత (Aam Aadmi Party - AAP) సిసోడియాను తీహార్ జైలుకు తరలించనున్నారు అధికారులు. వివరాలివే..

Manish Sisodia sent to Judicial Custody: సీబీఐ కస్టడీ ముగియటంతో మనీశ్ సిసోడియాను రౌజ్ అవెన్యూ కోర్టుకు ముందుకు అధికారులు సోమవారం తీసుకొచ్చారు. దీంతో ఆయనకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో జరిగిన అవినీతికి సంబంధం ఉందనే ఆరోపణలతో ఫిబ్రవరి 26వ తేదీన సోసిడియాను సీబీఐ అరెస్టు చేసింది. ఆ తర్వాత రౌజ్ అవెన్యూ కోర్టు ఐదు రోజుల సీబీఐ కస్టడీకి ఆయనను అప్పగించింది. అనంతరం రెండు రోజులు పొడిగించగా.. నేటితో ముగిసింది. దీంతో ఆయనకు మార్చి 20 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు.

బెయిల్ కోసం ప్రయత్నాలు

Manish Sisodia: బెయిల్ కోసం మనీశ్ సిసోడియా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. ముందు కింది కోర్టుకు వెళ్లాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. దీంతో రౌజ్ అవెన్యూ కోర్టులోనే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు సిసోడియా. ఈనెల 10వ తేదీన ఈ పిటిషన్ విచారణకు రానుంది.

మానసికంగా వేధించారు

Manish Sisodia: సీబీఐ కస్టడీలో సిసోడియాను అధికారులు మానసికంగా వేధించారని ఆమ్ఆద్మీ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. చేయని తప్పులను అంగీకరించాలని ఆయనను అధికారులు బలవంతం చేశారని చెప్పారు. మరోవైపు విచారణకు సిసోడియా సహకరించలేదని సీబీఐ అధికారులు వెల్లడించారు.

Manish Sisodia: మరోవైవు, ఆమ్ఆద్మీ, బీఆర్ఎస్ సహా 8 ప్రతిపక్షాల నేతలు.. ప్రధాని మోదీకి ఇటీవల లేఖరాశారు. సిసోడియా అరెస్టును ఖండించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ.. ప్రతిపక్షాల నేతలపైకి పంపుతున్నారంటూ ఆరోపించారు.

Manish Sisodia: సిసోడియాను కోర్టుకు తీసుకొచ్చిన ప్రతీసారి ఆమ్ఆద్మీ శ్రేణులు.. నిరసనలు నిర్వహిస్తున్నారు. సిసోడియాను అక్రమంగా అరెస్టు చేశారంటూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. శనివారం కూడా నిరసనలు చేశారు.

Manish Sisodia: మనీశ్ సిసోడియాతో పాటు ఇప్పటికే లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన సత్యేంద్ర జైన్ కూడా మంత్రి పదవులకు రాజీనామాలు చేశారు. వీరి రాజీనామాలను ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆమోదించారు.

తదుపరి వ్యాసం