BJP MLA shoots Shiv Sena leader : శివసేన నేతపై బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు..
03 February 2024, 9:36 IST
- Shiv Sena leader attacked by BJP MLA: మహారాష్ట్రలోని ఓ బీజేపీ ఎమ్మెల్యే.. శివసేన నేతపై కాల్పులు జరిపారు. పోలీస్ స్టేషన్లో, పోలీసుల సమక్షంలో ఈ ఘటన జరిగింది.
శివసేన నేతపై బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు..
Ganpat Gaikwad shoots Mahesh Gaikwad : మహారాష్ట్ర ఉల్లాస్ నగర్‌లోని హిల్ లైన్ పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం రేగింది. శివసేన (ఏక్నాథ్ శిండే) నేత మహేశ్ గైక్వాడ్‌పై బీజేపీ ఎమ్మెల్యే గణపతి గైక్వాడ్ కాల్పులు జరిపారు.
ఇదీ జరిగింది..
శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ అనిల్ జగ్తాప్ సమక్షంలో బీజేపీ ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్, నగర అధ్యక్షుడు మహేశ్ గైక్వాడ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు జరిపినట్టు సమాచారం. గణపతి గైక్వాడ్ ఐదు బుల్లెట్లు కాల్చగా.. మహేశ్‌తో పాటు ఆయన మద్దతుదారుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని వెంటనే థానెలోని జూపిటర్ ఆసుపత్రికి తరలించారు.
“మహేష్ గైక్వాడ్, గణపత్ గైక్వాడ్ మధ్య పలు విషయాల్లో విభేదాలు వచ్చాయని, వారు ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వచ్చారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆ సమయంలో వారు మాట్లాడుకోవడంతో గణపత్ గైక్వాడ్.. మహేష్ గైక్వాడ్, ఆయన అనుచరులపై కాల్పులు జరిపారు వివరించాయి. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. దర్యాప్తు కొనసాగుతోంది,” అని డీసీపీ సుధాకర్ పఠారే తెలిపారు.
ప్రతిపక్ష నేతలు ఏమన్నారంటే.
Maharasthra crime news : “పోలీస్ స్టేషన్లోనే కాల్పులు జరిగిగాయి. కాల్పులు జరిపిన వ్యక్తి బీజేపీ ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్. గాయపడిన వ్యక్తి శివసేన షిండే వర్గం నేత మహేశ్ గైక్వాడ్. లక్షలాది మంది సంక్షేమం కోసం పనిచేయాల్సిన ఎమ్మెల్యే.. ఇలా ప్రజలపై కాల్పులు జరపడం దురదృష్టకరమన్నారు. త్రిముఖ ప్రభుత్వంలో రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దాడి చేసకుంటున్నారు,” అని శివసేన నేత ఆనంద్ దూబే ఆరోపించారు.
యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ బీవీ ఈ ఘటనకు అధికార బీజేపీ-శివసేన కూటమియే కారణమని మండిపడ్డారు. కాల్పులు జరిపిన వ్యక్తి ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు సన్నిహితుడని, గాయపడిన వ్యక్తి ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేకు సన్నిహితుడని ఆయన ఆరోపించారు.
"మహారాష్ట్రలో రామరాజ్యం!" అంటూ ట్విట్టర్లో ఎద్దేవా చేశారు శ్రీనివాస్ బీవీ.
మరి ఈ విషయంపై ఏక్నాథ్, దేవేంద్ర ఫడణవీస్ ఎలా స్పందిస్తారో చూడాలి
ఎందుకు కాల్పులు జరిపారు?
BJP MLA shoots Shiv Sena leader : కళ్యాణ్ ఈస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని ఇరువురు నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే చాలాసార్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఈ దాడి వెనుక అసలు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు.. భూ వివాదం నేపథ్యంలో చర్చ కోసం ఇద్దరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.