Madrassas in Karnataka: మదరసాలతో ఉపయోగం లేదు; వాటిని మూసేస్తాం: బీజేపీ ఎమ్మెల్యే
08 January 2024, 19:35 IST
Madrassas in Karnataka: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నాలను నేతలు ప్రారంభించారు.
కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే బసన్నగౌడ పాటిల్
Madrassas in Karnataka: కర్నాటక (karnataka)లో బీజేపీ (BJP) ఎమ్మెల్యే బసన్నగౌడ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్నాటక (karnataka)లో మదరసాలతో ఎలాంటి ఉపయోగం లేదని, బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే, రాష్ట్రంలోని అన్ని మదరసాలను మూసేస్తామని ప్రకటించారు. పాటిల్ వ్యాఖ్యలపై రాష్ట్రంలో రాజకీయ దుమారం చెలరేగింది.
Madrassas closed in in Assam: అస్సాం సీఎం కూడా..
ఇటీవల అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ నాయకుడు హిమంత బిశ్వ శర్మ కర్నాటకలో పర్యటించారు. కర్నాటకలో జరిగిన విజయ సంకల్ప యాత్రలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ (Assam CM Himanta Biswa Sarma) పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన కూడా మదరసాల (Madrassas) గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అస్సాంలో తాను 600 మదరసాలను (Madrassas) మూసి వేశానని వెల్లడించాడు. ‘‘నాది అస్సాం. అక్కడికి రోజు వందల సంఖ్యలో బంగ్లాదేశ్ నుంచి ప్రజలు వస్తుంటారు. వారివల్ల మన సంస్కృతి సంప్రదాయాలకు ముప్పు కలుగుతోంది. 600 మదరసాలను మూసేయడం వెనుక నా ఉద్దేశమేంటని ఇటీవల నన్ను ఒక టీవీ ఇంటర్వ్యూలో అడిగారు. అస్సాంలోని 600 మదరసాలను కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మదరసాలను మూసేయాలన్నదే నా ఉద్దేశమని వారికి చెప్పాను’’ అని ఆ సభలో హిమంత బిశ్వ శర్మ (Assam CM Himanta Biswa Sarma) వ్యాఖ్యానించారు. మదరసాల (Madrassas) వల్ల ఉపయోగం లేదని, కొత్త విద్యా విధానంలో మదరసా చదువులకు స్థానం లేదని వివరించారు.
బీజేపీ ఎమ్మెల్యే మద్దతు
అస్సాం సీఎం బిశ్వ శర్మ (Assam CM Himanta Biswa Sarma) చేసిన ఈ వ్యాఖ్యలను కర్నాటక (karnataka) లోని బీజేపీ బీజాపూర్ ఎమ్మెల్యే బసన్నగౌడ పాటిల్ సమర్ధించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే కర్నాటక (karnataka) లో కూడా మదరసాల (Madrassas)ను మూసేస్తామని ప్రకటించారు. ‘‘కర్నాటకలో మదరసాలతో ఎలాంటి ఉపయోగం లేదు. వాటిని మూసేయాల్సిందే. ఇక్కడ కూడా బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం చేసినట్లుగా ఇక్కడ కూడా అన్ని మదరసాలను (Madrassas) మూసి వేస్తాం’’ అన్నారు.