Karnataka MP Controversy: భర్త జీవించే ఉన్నారా? బొట్టెక్కడ?: బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
Karnataka MP Controversy: “నీ భర్త జీవించే ఉన్నారా.. అయితే బొట్టు పెట్టుకో” అంటూ కర్ణాటకకు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే ఓ మహిళతో అనడం వివాదంగా మారింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‍గా మారింది.
Karnataka MP Controversy: కర్ణాటకలో బీజేపీకి చెందిన ఓ ఎంపీ వివాదంలో చిక్కుకున్నారు. మహిళా దినోత్సవం రోజున ఆయన ఓ మహిళతో మాట్లాడిన మాటలపై విమర్శలు వస్తున్నాయి. వివాహం అయిందనే సూచికగా బొట్టు ఎందుకు పెట్టుకోలేదని ఓ మహిళను ఆయన ప్రశ్నించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆయన తీరుపై కొందరు విమర్శలు కురిపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇవే.
Karnataka MP Controversy: కోలార్ జిల్లాలో ఓ ఎగ్జిబిషన్ ఫెయిర్‌ను ప్రారంభించేందుకు వెళ్లిన కోలార్ ఎంపీ కె.మునిస్వామి (Muniswamy) ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళలు తయారు చేసిన దుస్తులను ప్రదర్శనకు ఉంచేందుకు, విక్రయించేందుకు ఈ ఫెయిర్ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. దీని ప్రారంభానికి ఎంపీని ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్టాళ్లను ఎంపీ పరిశీలించారు. ఈ క్రమంలోనే ఓ స్టాల్‍ను నిర్వహిస్తున్న ఓ మహిళతో ఆయన మాట్లాడారు. మీ భర్త జీవించే ఉన్నారుగా అంటూ ప్రశ్నించారు.
Karnataka MP Controversy: "నీ పేరేంటి? నీ నుదిటిపై బొట్టు ఎందుకు లేదు? మీ స్టాల్ పేరు ఏమో వైష్ణవి అని ఉంది? నుదిటిపై బొట్టు పెట్టుకోండి. మీ భర్త జీవించే ఉన్నారు కదా?" అని ఎంపీ మునిస్వామి.. ఆ మహిళతో అన్నారు.
ఇందుకు సంభందించిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది వైరల్ గా మారింది. ఆ ఎంపీ వ్యాఖ్యలు పట్ల కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు.
హిందుత్వ ఇరాన్ చేస్తారా..
Karnataka MP Controversy: ఎంపీ మునిస్వామి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియాను బీజేపీ హిందుత్వ ఇరాన్‍గా మారుస్తోందంటూ తీవ్రంగా విమర్శించారు. “భారత్‍ను బీజేపీ.. హిందుత్వ ఇరాన్‍గా మారుస్తుంది. వీధుల్లో పెట్రోలింగ్ చేసేందుకు అయతుల్లా లాంటి మోరల్ పోలీసుల వెర్షన్‍ను బీజేపీ కలిగి ఉంది” అని కార్తీ పీ చిదంబరం ట్వీట్ చేశారు.
మహిళను అవమానపరిచేలా, అభ్యంతరకరంగా ఎంపీ మాట్లాడారని మరికొందరు ట్విట్టర్లో కామెంట్లు చేస్తున్నారు.
Karnataka MP Controversy: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే ఓ మహిళను ఇలా కించపరుస్తారా అంటూ సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ఎంపీ తీరును చాలా మంది తప్పుబడుతున్నారు.
కర్ణాటకలో రాజకీయ నేతలు.. ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేయడం, అభ్యంతరకరంగా మాట్లాడిన ఘటనలు గతంలోనూ జరిగాయి. గతేడాది చమరాజనగర్‌లో బీజేపీ మంత్రి వి.సోమన్న ఓ మహిళ చెంపపై కొట్టారు. తనకు భూమి కేటాయింపు జరగలేదని అడిగిన మహిళపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది.