తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Lpg Cylinder Price: గుడ్‌ న్యూస్‌.. భారీగా తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

LPG Cylinder Price: గుడ్‌ న్యూస్‌.. భారీగా తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

HT Telugu Desk HT Telugu

01 September 2022, 8:21 IST

google News
    • LPG Cylinder Price: గ్యాస్‌ సిలిండర్‌ ధర భారీగా తగ్గింది. సెప్టెంబర్‌ నెల తొలి రోజే ఆయిల్‌ కంపెనీలు వినియోగదారులకు గుడ్‌న్యూస్‌ అందించాయి.
డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పూ లేదు
డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పూ లేదు (HT PHOTO)

డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పూ లేదు

LPG Cylinder Price: వాణిజ్య అవసరాల కోసం వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరను భారీగా తగ్గించాయి ఆయిల్ కంపెనీలు. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్‌ ధరను రూ.91.5 మేర తగ్గించినట్లు ఆయిల్‌ కంపెనీలు ప్రకటించాయి. ఇది నిజంగా వాణిజ్య సిలిండర్‌ వినియోగించే వారికి గొప్ప ఊరట కలిగించే విషయమే. ఈ కొత్త ధరలు గురువారం (సెప్టెంబర్‌ 1) నుంచి అమల్లోకి రానున్నాయి.

ధర తగ్గిన తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో గతంలో రూ.1976గా ఉన్న 19 కేజీల కమర్షియల్‌ ఎల్పీజీ సిలిండర్‌ ఇప్పుడు రూ.1885కే రానుంది. ఇక హైదరాబాద్‌లో ఈ సిలిండర్‌ ధర రూ.2099కి తగ్గింది. వరంగల్‌లో రూ.2141గా, విజయవాడలో రూ.2034గా, విశాఖపట్నంలో రూ.1953గా ఉంది. వాణిజ్య సిలిండర్‌ ధర క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ సిలిండర్‌ ధరను తగ్గించడం ఇది వరుసగా ఐదోసారి కావడం విశేషం.

అయితే కమర్షియల్‌ సిలిండర్‌ ధరలు తగ్గించిన ఆయిల్ కంపెనీలు.. డొమెస్టిక్‌ సిలిండర్‌ ధరను మాత్రం అలాగే ఉంచాయి. నెల రోజులుగా డొమెస్టిక్‌ సిలిండర్‌ ధరలో ఎలాంటి మార్పులు లేవు. ఆగస్ట్‌ 1న హైదరాబాద్‌లో 14.2 కేజీల సిలిండర్‌ రూ.1105గా ఉండగా.. ఇప్పుడూ అంతే ఉంది. చివరిసారి జులై 6వ తేదీని ఈ సిలిండర్‌ రూ.50 పెంచారు. ఆ తర్వాత ఇందులో హెచ్చుతగ్గులేమీ లేకుండా స్థిరంగా ఉంటోంది.

నిజానికి ప్రతి నెలలో ఈ సిలిండర్ల ధరలను రెండుసార్లు సవరించే అవకాశం ఆయిల్‌ కంపెనీలకు ఉంటుంది. ప్రతి 15 రోజులకోసారి సిలిండర్‌ ధర పెంచడం లేదా తగ్గించడం చేస్తాయి. అయితే డొమెస్టిక్‌ సిలిండర్‌ ధరను చాలా రోజులగా సవరించలేదు.

టాపిక్

తదుపరి వ్యాసం