తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Loan Recovery Agent Kills Woman : గర్భవతిని ట్రాక్టర్​తో తొక్కించిన లోన్​ రికవరీ ఏజెంట్​!

Loan recovery agent kills woman : గర్భవతిని ట్రాక్టర్​తో తొక్కించిన లోన్​ రికవరీ ఏజెంట్​!

Sharath Chitturi HT Telugu

17 September 2022, 8:26 IST

google News
  • Loan recovery agent kills pregnant woman : వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ దివ్యాంగుడి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. లోన్​ రికవరీ ఏజెంట్​ చేసిన పనితో.. ఆ దివ్యాంగుడి కుమార్తె ప్రాణాలు కోల్పోయింది. మూడు నెలల గర్భవతిపై ట్రాక్టర్​ తొక్కించి చంపేశాడు ఆ లోన్​ రికవరీ ఏజెంట్​. ఈ దారుణ ఘటన ఝార్ఖండ్​లో చోటుచేసుకుంది.

గర్భవతిని ట్రాక్టర్​తో తొక్కించిన లోన్​ రికవరీ ఏజెంట్​!
గర్భవతిని ట్రాక్టర్​తో తొక్కించిన లోన్​ రికవరీ ఏజెంట్​!

గర్భవతిని ట్రాక్టర్​తో తొక్కించిన లోన్​ రికవరీ ఏజెంట్​!

Loan recovery agent kills pregnant woman : ఝార్ఖండ్​లో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 3 నెలల గర్భవతిపైకి ట్రాక్టర్​ ఎక్కించి చంపేశాడు ఓ లోన్​ రికవరీ ఏజెంట్​.

ఇంత దారుణమా..

పోలీసుల సమాచారం ప్రకారం.. హజారిబాఘ్​లోని ఇచక్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో గురువారం జరిగింది ఈ ఘటన. ఆ ప్రాంతంలో ఓ దివ్యాంగుడు పొలం పనులు చేసుకుంటూ జీవితన్ని గడుపుతున్నాడు. ఆయనకు ఓ కుమార్తె ఉంది. ఆమె మూడు నెలల గర్భవతి.

కాగా.. మహీంద్రా ఫైనాన్స్​ నుంచి లోన్​ రికవరీ ఏజెంట్​.. గురువారం ఆ దివ్యాంగుడి ఇంటికి వెళ్లాడు. వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్​ను స్వాధీనం చేసుకునేందుకు లోన్​ రికవరీ ఏజెంట్​ ప్రయత్నించాడు. ట్రాక్టర్​కు ఆ గర్భవతి అడ్డంగా నిలబడింది. ఫలితంగా.. చక్రాల కింద పడి, ఆ గర్భవతి ప్రాణాలు కోల్పోయింది.

Pregnant woman killed by loan recovery agent : ఆమెను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించిందని వైద్యులు ధ్రువీకరించారు.

బాధితుల ఇంటికి వెళ్లే ముందు.. లోన్​ రికవరీ అధికారులు తమకు ఎలాంటి సమాచారం అందించలేదని స్థానిక పోలీసులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టామని స్పష్టం చేశారు.

ఈ వ్యవహారంపై మహీంద్రా గ్రూప్​ మేనేజింగ్​ డైరక్టర్​, సీఈఓ అనీశ్​ షా స్పందించారు. ఘటనపై తాము కూడా దర్యాప్తు చేపడతామని స్పష్టం చేశారు.

"హజారిబాఘ్​లో జరిగిన ఘటన అత్యంత బాధాకరం. ప్రస్తుతం ఉన్న థర్డ్​ పార్టీ కలక్షన్​ ఏజెంట్ల వ్యవస్థను మేము మళ్లీ సమీక్షిస్తాము," అని షా ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో పోలీసుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు.

తదుపరి వ్యాసం