Security guard beats woman : గర్భవతిని కాలితో తన్నిన సెక్యూరిటీ గార్డు..
Security guard beats woman : ఓ సెక్యూరిటీ గార్డు.. ఓ గర్భవతిని కాలితో తన్నిన ఘటన పాకిస్థాన్‌లో వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Security guard beats woman : పాకిస్థాన్‌కు చెందిన ఓ విడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గర్భవతిని ఓ సెక్యూరిటీ గార్డు కాలితో తన్నడం ఆ వీడియోలో కనిపించింది.
కరాచీలోని గులిస్తాన్ ఈ జుహర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తొలుత.. ఆ మహిళ- సెక్యూరిటీ గార్డు కొంతసేపు మాట్లాడుకోవడం ఈ వీడియోలో రికార్డ్ అయ్యింది. ఆ వెంటనే.. గర్భవతిపై సెక్యూరిటీ గార్డ్ దాడి చేశాడు. ముఖం మీద కొట్టాడు. కిందపడేసి కాలితో తన్నాడు. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలకు ఈ దృశ్యాలు చిక్కాయి.
పక్కనే కొందరు ఉన్నా.. సెక్యూరిటీ గార్డును ఆపేందుకు ఎవరు ప్రయత్నించకపోవడం గమనార్హం.
ఆ రోజు జరిగిన ఘటనను ఆ గర్భవతి మీడియాకు వివరించింది.
"ఆగస్టు 5 తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. నేను ఓ ఇంట్లో పనిమిషిగా పనిచేస్తున్నా. ఫుడ్ డెలివరీ చేయడానికి నా కుమారుడు వచ్చాడు. సెక్యూరిటీ గార్డులు అతడిని లోపలికి రానివ్వలేదు. విచారించేందుకు నేను కిందకి వచ్చాను. అదిల్ నాసిర్ అనే యూనియన్ ఆఫీసు బేరర్.. నా మీద అరవడం మొదలుపెట్టాడు. నన్ను కొట్టాలని సెక్యూరిటీ గార్డుకు చెప్పాడు. దెబ్బల వల్ల నేను స్పృహకోల్పోయి పడిపోయాను," అని ఆ మహిళ వివరించింది.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నారు. ఘటనపై సింధ్ రాష్ట్రం సీఎం మురాద్ అలీ షా మండిపడ్డారు. మహిళపై చెయ్యి ఎత్తే అంత ధైర్యం అతనికి ఎలా వచ్చిందని ప్రశ్నించారు.
ఘటనపై నెటిజన్లు మండిపడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన దృశ్యాలను ఇక్కడ చూడండి:
సంబంధిత కథనం