తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kia India Car Sales: 5 లక్షలకు పైగా కార్లు విక్రయించిన కియా ఇండియా

Kia India car sales: 5 లక్షలకు పైగా కార్లు విక్రయించిన కియా ఇండియా

HT Telugu Desk HT Telugu

19 July 2022, 19:02 IST

google News
  • Kia India car sales: తొలి 3 ఏళ్లలో 5 లక్షలకు పైగా కార్లు అమ్మినట్టు కియా ఇండియా ప్రకటించింది.

కియా కారెన్స్‌తో కియా ఇండియా సంస్థ ఎండీ
కియా కారెన్స్‌తో కియా ఇండియా సంస్థ ఎండీ (PTI)

కియా కారెన్స్‌తో కియా ఇండియా సంస్థ ఎండీ

న్యూఢిల్లీ, జూలై 19: దేశంలో కార్యకలాపాలు ప్రారంభించిన మూడేళ్లలోపే దేశీయ మార్కెట్‌లో 5 లక్షల సేల్స్ మార్కును అధిగమించినట్లు కార్ల తయారీ సంస్థ కియా ఇండియా మంగళవారం తెలిపింది.

భారత్‌లో ఈ ఘనత సాధించి అత్యంత వేగవంతమైన కార్ల తయారీదారుగా అవతరించినట్లు కంపెనీ పేర్కొంది. కియా కారెన్స్‌కు ఉన్న బలమైన డిమాండ్‌తో కేవలం నాలుగున్నర నెలల్లోనే తమ చివరి లక్ష విక్రయాలను సాధించినట్లు కంపెనీ తెలిపింది. ఎగుమతులతో కలిపి కియా ఇండియా క్యుములేటివ్ సేల్స్ 6,34,224 యూనిట్లకు పెరిగాయి.

భారతీయ మార్కెట్లో బలమైన పనితీరుతో కంపెనీ ఇప్పుడు కియా కార్పొరేషన్ గ్లోబల్ సేల్స్‌లో 6 శాతం కంటే ఎక్కువ వాటా సాధించినట్టు వాహన తయారీ సంస్థ పేర్కొంది. ‘భారతదేశంలో మూడు సంవత్సరాలలో స్పూర్తిదాయకమైన బ్రాండ్‌గా స్థిరపడటమే కాకుండా కొత్త సాంకేతికతలను అందించడంలో కూడా అగ్రగామిగా ఉన్నాం..’ అని కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ మ్యుంగ్-సిక్ సోహ్న్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఐదు ఉత్పత్తులలో మూడు స్థానికంగా తయారు చేయడమే కాకుండా వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

మధ్య తరహా ఎస్‌యూవీ సెల్టోస్ కంపెనీ మొత్తం అమ్మకాల్లో అగ్రగామిగా కొనసాగుతోందని వాహన తయారీ సంస్థ తెలిపింది. ఈ మోడల్ కంపెనీ మొత్తం సేల్స్‌లో 59 శాతం వాటా సాధించిందని, సోనెట్‌ మోడల్ సేల్స్ 32 శాతానికి పైగా ఉన్నాయని తెలిపింది.

కియా కారెన్స్ ప్రారంభించిన ఐదు నెలల్లోనే కంపెనీ దేశీయ అమ్మకాల్లో 6.5 శాతానికి దగ్గరగా నిలిచిందని వాహన తయారీ సంస్థ తెలిపింది. సెల్టోస్ మిడ్-ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో తన బలమైన స్థానాన్ని కొనసాగిస్తోందని, ఈ కేటగిరీలోని వాహనాల అమ్మకాల్లో 40 శాతానికి పైగా వాటా ఉందని కియా తెలిపింది.

సోనెట్ 15 శాతం వాటాతో కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో పటిష్టంగా ఉందని తెలిపింది. కారెన్స్, కార్నివాల్ రెండూ కూడా బలమైన అమ్మకాలను నమోదు చేస్తూనే ఉన్నాయని వాహన తయారీ సంస్థ తెలిపింది.

తదుపరి వ్యాసం