Karnataka polls: ఎట్టకేలకు కర్నాటక బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ విడుదల
08 January 2024, 18:59 IST
BJP's 1st list: దాదాపు మూడు రోజుల పాటు జరిగిన ఉన్నత స్థాయి చర్చోపచర్చల అనంతరం, ఎట్టకేలకు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా వెలువడింది.
బీజేపీ కర్నాటక వ్యవహారాల ఇన్ చార్జి ధర్మేంద్ర ప్రధాన్
BJP's 1st list: దాదాపు మూడు రోజుల పాటు జరిగిన ఉన్నత స్థాయి చర్చోపచర్చల అనంతరం, ఎట్టకేలకు కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో (karnataka assembly elections 2023) పోటీ చేయనున్న బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా వెలువడింది. 189 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. కర్నాటక అసెంబ్లీలోని మొత్తం స్థానాల సంఖ్య 224 అన్న విషయం తెలిసిందే.
BJP's 1st list in Karnataka polls: కొత్త ముఖాలు 52
బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో 52 కొత్త ముఖాలకు స్థానం కల్పించారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం రాత్రి 52 మంది కొత్త సభ్యులతో కూడిన 189 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తరఫున గెలిచి, తరువాత రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం కోసం సహకరించిన ఎమ్మెల్యేలందరికీ ఈ సారి టికెట్లు లభించినట్లు తెలుస్తోంది. బీజేపీ విడుదల చేసిన 189 పేర్లతో కూడిన తొలి జాబితాలో కొత్తగా 52 మందికి అవకాశం కల్పించారు. అలాగే, ఈ జాబితాలో ఇతర వెనుకబడిన వర్గాల వారు (OBC) 32 మంది, షెడ్యూల్డ్ కులాల (SC)కు చెందిన వారు 20 మంది, షెడ్యూల్డ్ తెగలకు (ST) చెందిన వారు 16 మంది ఉన్నారు. ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై షిగ్గావ్ () నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కర్నాటక బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర షికారి పుర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే, రాష్ట్ర మంత్రి బీ శ్రీరాములు బళ్లారి గ్రామీణ స్థానం నుంచి బరిలో నిలవనున్నారు. ఈ వివరాలను బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ వెల్లడించారు.