Karnataka assembly elections : ‘ఇక ఎన్నికల్లో పోటీ చేయను’- సిద్ధరామయ్య!
Karnataka assembly elections : ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పారు కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య. త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలే తనకు చివరిదని స్పష్టం చేశారు.
Karnataka assembly elections : కర్ణాటక ఎల్ఓపీ (లీడర్ ఆఫ్ అపోజీషన్), కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య.. తన రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలే తనకు చివరిదని చెప్పిన ఆయన.. ఆ తర్వాత ఎన్నికల రాజకీయాల నుంచి రిటైర్ అవ్వనున్నట్టు స్పష్టం చేశారు.
‘ఇదే చివరిది..’
2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ వార్తాసంస్థ ఏఎన్ఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు సిద్ధరామయ్య. ఈ క్రమంలోనే ఎన్నికల రాజకీయాలకు వీడ్కోలు విషయంపై స్పందించారు.
Siddaramaiah retirement : "నేను పుట్టిన గ్రామం వరుణ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది. అందుకే ఈసారి ఇక్కడి నుంచి పోటీచేస్తున్నాను. ఇదే నా చివరి ఎన్నిక. ఆ తర్వాత ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకుంటాను. హైకమాండ్ చెప్పినట్టుగానే వరుణ నుంచి పోటీచేస్తున్నాను. నాకు ఆసక్తి లేదని కాదు.. కానీ కోలర్ ప్రాంతం ప్రజలు నేను అక్కడ పోటీ చేయాలని కోరుకుంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా.. రాజకీయాల్లో క్రియాశీలకంగానే ఉంటాను," అని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌తో తనకు విభేదాలు ఉన్నట్టు వస్తున్న వార్తలను సిద్ధరామయ్య ఖండించారు.
"సిద్ధరామయ్యతో నాకు మంచి సంబంధం ఉంది. మా మధ్య విభేదాలేవీ లేవు. ప్రజాస్వామ్యంలో విభేదాలు సహజమే. అయితే.. అవి పార్టీని ప్రభావితం చేసే విధంగా లేవు," అని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
'బీజేపీ ఓటమి ఖాయం..'
ఈ దఫా ఎన్నికల్లో 130కిపైగా సీట్లల్లో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత. బీజేపీకి ప్రజలు ఓట్లేయరని అన్నారు.
Karnataka assembly elections schedule : "130కిపైగా సీట్లల్లో విజయం సాధించి.. ఈసారి కాంగ్రెస్ పార్టీ సులభంగా అధికారంలోకి వస్తుంది. ఈ ప్రభుత్వాన్ని మార్చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. కన్నడిగుల ప్రయోజనాల కోసం సీఎం బసవరాజ్ బొమ్మై పనిచేయలేదు. ఆయనకు సీఎంగా ఉండే అర్హతే లేదు. ఇదొక డబుల్ ఇంజిన్ సర్కార్ అని ప్రధాని మోదీ, అమిత్ షాలు చెబుతున్నారు. కానీ వాస్తవం అలా లేదు," అని మండిపడ్డారు సిద్ధరామయ్య.
Siddaramaiah Congress : 224 సీట్లున్న కర్ణాటక అసెంబ్లీకి.. మే 10న సింగిల్ ఫేజ్‌లో ఎన్నికలు జరుగుతుండగా.. ఫలితాలు మే 13న వెలువడనున్నాయి. మరి సిద్ధరామయ్య మాటలు నిజం అవుతాయా? ప్రజలు బీజేపీకి గుడ్ బై చెబుతారా? అన్నది వేచిచూడాలి.
సంబంధిత కథనం