Karnataka Elections : కర్ణాటక ఎన్నికల్లో ఈ సీట్లపైనే అందరి దృష్టి.. గెలిచేదెవరు?-2023 karnataka assembly elections important seats to watch out for ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Karnataka Elections : కర్ణాటక ఎన్నికల్లో ఈ సీట్లపైనే అందరి దృష్టి.. గెలిచేదెవరు?

Karnataka Elections : కర్ణాటక ఎన్నికల్లో ఈ సీట్లపైనే అందరి దృష్టి.. గెలిచేదెవరు?

Sharath Chitturi HT Telugu
Apr 07, 2023 07:45 AM IST

2023 Karnataka Assembly Elections : కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. వీటిల్లో కొన్నింటిపై అందరి దృష్టిపడింది. ఈ సీట్లల్లో గెలిచేదెవరు? ఓడేదెవరు? అని సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి.

కర్ణాటక ఎన్నికల్లో ఈ సీట్లపైనే అందరి దృష్టి.. గెలిచేదెవరు?
కర్ణాటక ఎన్నికల్లో ఈ సీట్లపైనే అందరి దృష్టి.. గెలిచేదెవరు?

2023 Karnataka Assembly Elections : కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి తారస్థాయిలో ఉంది. ప్రచారాలు, హామీలు, మాటల యుద్ధాలతో అక్కడి వాతావరణం ఇప్పటికే వేడెక్కింది. 224 సీట్లున్న కర్ణాటక అసెంబ్లీకి వచ్చే నెల 10న ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. ఈ 224లో కొన్ని నియోజకవర్గాలు హాట్​టాపిక్​గా మారాయి. ఈ సీట్లల్లో మళ్లీ గెలివాలని సిట్టింగ్​ ఎమ్మెల్యేలు భావిస్తుంటే.. వారి నుంచి కీలకమైన నియజకవర్గాలను లాగేసుకోవాలని ఇంకొందరు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ తరుణంలో.. ఆ నియోజకవర్గాలేంటి? పోటీదారులెవరు? వంటి వివరాలు తెలుసుకుందాము..

సీఎం.. మాజీ సీఎం.. దిగ్గజ నేతల సీట్లు..!

షిగ్గావ్​:- ఇది సీఎం బసవరాజ్​ బొమ్మై నియోజకవర్గం. 2018 ఎన్నికల్లో 9,265 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్​ అభ్యర్థి సయ్యద్​ అజీమ్​ పీర్​ ఖాద్రిపై గెలుపొందారు.

Karnataka Assembly Elections schedule : వరుణ:- 2018 ఎన్నికల ముందు వరకు ఇది కాంగ్రెస్​ దిగ్గజ నేత సిద్ధరామయ్య కంచుకోట. నాటి ఎన్నికల్లో తన కుమారుడు యథంద్రాకు అప్పగించారు. సిద్ధరామయ్య రెండు నియోజకవర్గాల్లో (చాముండేశ్వరి, బదామి)లో పోటీచేశారు. బదామీలో గెలిచారు. ఇప్పుడు మళ్లీ తన కంచుకోట నుంచే పోటీచేస్తున్నారు సిద్ధరామయ్య.

రామనగర:- మాజీ సీఎం హెచ్​డీ కుమారస్వామి సతీమణి, మాజీ ప్రధాని దేవెగౌడ కోడలు అనిత కుమారస్వామి.. 2018లో ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు. ఈసారి.. కుమారస్వామి తనయుడు నిఖిల్​ ఇక్కడి నుంచి బరిలో దిగుతున్నారు. 2019లోక్​సభ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు నిఖిల్​.

BJP Karnataka Assembly Elections : మాండ్య:- జేఎడ్​ఎస్​కు చెందిన ఎం శ్రీనివాస్​.. 2018ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్​, బీజేపీలో రెండు, మూడుస్థానాల్లో నిలిచాయి. కాగా ఇప్పుడు ఈ సీటులో పోటీ చేసే బీజేపీ అభ్యర్థికి మద్దతిస్తున్నట్టు.. స్వతంత్ర ఎంపీ సుమలత ఇటీవలే ప్రకటించారు.

కనకపుర:- కాంగ్రెస్​ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్​ కంచుకోట ఇది. ఇక్కడి నుంచి ఆయన 7సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1989 నుంచి ఇక్కడ జరిగిన అన్ని ఎన్నకల్లోనూ ఆయనే గెలిచారు.

హసన్​:- 2018 ఎన్నికల ముందు వరకు ఈ సీటు.. జేడీఎస్​కు కంచుకోగా ఉండేది. కానీ నాటి ఎన్నికల్లో బీజేపీ ప్రీథమ్​ గౌడె.. జేడీఎస్​కు షాకిచ్చారు. 13వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఈసారి ఇక్కడి టికెట్​ విషయంపై జేడీఎస్​లో అంతర్గత కుమ్ములాట నెలకొన్నట్టు తెలుస్తోంది.

Congress Karnataka Assembly Elections : కోలర్​:- ఈ నియోజకవర్గంలో జేడీఎస్​కు చెందిన శ్రీనివాస గౌడ సిట్టింగ్​ ఎమ్మెల్యగా ఉన్నాయి. కాగా.. గత రాజ్యసభ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్​కు మద్దతిచ్చారు. ఇది జేడీఎస్​కు నచ్చలేదు. ఇప్పుడు మరో అభ్యర్థిని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

చెన్నపట్నా:- 2018లో చెన్నపట్నా నుంచి పోటీ చేసిన హెచ్​డీ కుమారస్వామి.. స్థానికంగా పేరుమోసిన సీపీ యగేశ్వరను ఓడించారు. వాస్తవానికి ఆయన్ని ఓడించేందుకు కుమారస్వామి ఇక్కడి నుంచి పోటీచేశారు. 2023లోనూ ఇక్కడి నుంచే బరిలో దిగుతున్నారు కుమారస్వామి.

షికారిపుర:- మాజీ సీఎం, బీజేపీ దిగ్గజం, లింగాయత్​ నేత యడియూరప్ప కంచుకోట ఇది. ఆయన రిటైర్​ అవ్వడంతో ఇది ఖాళీ అయ్యింది. అయితే.. ఆయన కుమారుడు బీవై విజయేంద్రకు ఈ సీటు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

2023 Karnataka Assembly Elections : శివమొగ్గ:- ఇక్కడి సిట్టింగ్​ ఎమ్మెల్యే పేరు కేఎస్​ ఈశ్వరప్ప. అవినీతి ఆరోపణల కారణంగా ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

సోరాబా:- ఇక్కడి బీజేపీ సిట్టింగ్​ ఎమ్మెల్యే పేరు కుమార బంగారప్ప. ఆయన.. తన సోదరుడు మధు బంగారప్పపై పోటీ చేసి 2018లో గెలిచారు. వీరిద్దరు మాజీ సీఎం ఎస్​ బంగారప్ప కుమారులు. గత ఎన్నికల్లో మధు బంగారప్పకు జేడీఎస్​ సీటు ఇచ్చింది. ఆయన ఈసారి కాంగ్రెస్​లో ఉన్నారు.

మే 10న సింగిల్​ ఫేజ్​లో ఎన్నికలు జరుగుతుండగా.. ఫలితాలు మే 13న వెలువడనున్నాయి. మరి ఈ సీట్లల్లో గెలిచేదెవరు? ఓడేదెవరు? అన్న ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభించనుంది.

Whats_app_banner

సంబంధిత కథనం