తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jee Main 2023: జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డ్స్ రెడీ; ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..

JEE Main 2023: జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డ్స్ రెడీ; ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..

HT Telugu Desk HT Telugu

08 January 2024, 19:00 IST

google News
  • JEE Main 2023: ఏప్రిల్ 13న జరిగే జేఈఈ మెయిన్ 2023 (JEE Main) సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. విద్యార్థులు jeemain.nta.nic.in. వెబ్ సైట్ నుంచి అడ్మిట్ కార్డ్స్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

JEE Main 2023: ఏప్రిల్ 13న జరిగే జేఈఈ మెయిన్ 2023 (JEE Main) సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency NTA) విడుదల చేసింది. విద్యార్థులు jeemain.nta.nic.in. వెబ్ సైట్ నుంచి అడ్మిట్ కార్డ్స్ (admit card) ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

JEE Main : ఏప్రిల్ 13 పరీక్షకే..

ఏప్రిల్ 13న జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్ష రాస్తున్న అభ్యర్థులు మాత్రమే jeemain.nta.nic.in. వెబ్ సైట్ నుంచి అడ్మిట్ కార్డ్స్ (admit card) ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబర్, పుట్టిన రోజు వివరాలను jeemain.nta.nic.in. వెబ్ సైట్ లో ఫిల్ చేసి తమ అడ్మిట్ కార్డ్ (admit card) ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ హాల్ టికెట్లు బీఈ, బీటెక్, బీ ఆర్క్ (B.E. / B.Tech. and B.Arch) పరీక్షలకు సంబంధించినవి. విద్యార్థులు తమ అడ్మిట్ కార్డ్స్ ను నేరుగా డౌన్ లోడ్ చేసుకోవడం డైరెక్ట్ లింక్ ను కింద ఇస్తున్నాం.

How to download JEE Mains Admit Card: డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా?

జేఈఈ మెయిన్ 2023 సెషన్ 2 ఏప్రిల్ 13 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు..

  • ముందుగా ఎన్టీఏ జేఈఈ అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in. ను ఓపెన్ చేయాలి.
  • హోం పేజీపై కనిపిస్తున్న JEE Mains Admit Card 2023 లింక్ పై క్లిక్ చేయాలి.
  • లాగిన్ డిటైల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి.
  • మీ అడ్మిట్ కార్డ్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
  • వివరాలు సరి చూసుకుని, అడ్మిట్ కార్డ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
  • భవిష్యత్ అవసరాల కోసం అడ్మిట్ కార్డ్ సాఫ్ట్ కాపీని, హార్డ్ కాపీని భద్రపర్చుకోవాలి.

Direct link to download admit card

తదుపరి వ్యాసం