JEE Mains 2023 Session 2: జేఈఈ మెయిన్ 2023 సెషన్ 2 అడ్మిట్ కార్డులు విడుదల.. ఎలా డౌన్‍లోడ్ చేసుకోవాలంటే!
JEE Main 2023 Session 2 Admit Cards: జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు వచ్చేశాయి. ఈ పరీక్షకు అప్లై చేసిన అభ్యర్థులు ఈ హాట్ టికెట్‍ను డౌన్‍లోడ్ చేసుకోవచ్చు.
JEE Main 2023 Session 2 Admit Cards: జేఈఈ మెయిన్ 2023 సెషన్ 2 అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency - NTA) సోమవారం ఈ అడ్మిట్ కార్డులను రిలీజ్ చేసింది. ఈ సెకండ్ సెషన్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అడ్మిట్ కార్డులను డౌన్‍లోడ్ చేసుకోవచ్చు. ఈనెల 6వ తేదీ నుంచి జేఈఈ మెయిన్ 2023 సెషన్ 2 పరీక్ష జరగనుంది. ఈ అడ్మిట్ కార్డును ఎలా డౌన్‍లోడ్ చేసుకోవాలో ఇక్కడ చూడండి.
JEE Main 2023 Session 2 Admit Cards: జేఈఈ మెయిన్ 2023 సెషన్ 2 పరీక్ష ఏప్రిల్ 6, 8, 10, 11, 12, 13, 15 తేదీల్లో జరగనుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (Computer Based Test - CBT)గా ఈ పరీక్ష ఉంటుంది. ఈ జాయింట్ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ (JEE) పరీక్ష కోసం దేశవ్యాప్తంగా 330 సిటీల్లో ఎగ్జామ్ సెంటర్లు ఉన్నాయి. విదేశాల్లో 15 నగరాల్లో ఉన్నాయి. సెషన్ 2 కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు jeemain.nta.nic.in వెబ్‍సైట్‍లో అడ్మిట్ కార్డు డౌన్‍లోడ్ చేసుకోవచ్చు. ప్రాసెస్ ఇదే.
జేఈఈ మెయిన్ 2023 సెషన్ 2 అడ్మిట్ కార్డు డౌన్‍లోడ్ ఇలా..
- ముందుగా jeemain.nta.nic.in వెబ్‍సైట్‍లోకి వెళ్లాలి.
- హోమ్ పేజీలో జేఈఈ మెయిన్ 2023 సెషన్ 2 అడ్మిట్ కార్డ్ డౌన్‍లోడ్ లింక్ ఉంటుంది.
- ఆ లింక్‍పై క్లిక్ చేస్తే ఓ పేజీ ఓపెన్ అవుతుంది.
- ఆ పేజీలో అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, అక్కడే ఉన్న సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్‍పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత మీ అడ్మిట్ కార్డు స్క్రీన్‍పై కనిపిస్తుంది.
- ఆ అడ్మిట్ కార్డును డౌన్‍లోడ్ చేసుకొని.. ప్రింట్ తీసుకోవాలి.
JEE Main 2023 Session 2 Admit Cards: జేఈఈ మెయిన్ సెషన్ 2 అడ్మిట్ కార్డుపై అభ్యర్థి పేరు, అప్లికేషన్ నంబర్, ఫొటోగ్రాఫ్, సంతకం, డే ఆఫ్ బర్త్, ఎగ్జామ్ డేట్, షిఫ్ట్ టైమింగ్స్, ఎగ్జామ్ సెంటర్ వివరాలు ఉంటాయి. అడ్మిట్ కార్డు డౌన్‍లోడ్ చేసుకున్న వెంటనే వివరాలన్నింటినీ అభ్యర్థులు వెరిఫై చేసుకోవాలి. అడ్మిట్ కార్డులో ఏవైనా పొరపాట్లు ఉంటే వెంటనే ఎగ్జామినేషన్ అథారిటీని సంప్రదించాలి.
ఐఐటీలు, ఎన్ఐటీలతో పాటు కేంద్ర ప్రభుత్వం నడిపే ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం జేఈఈ పరీక్షను ఎన్‍టీఏ నిర్వహిస్తుంది. ఆల్ ఇండియా ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.