తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jagannath Rath Yatra : అదిగో జగన్నాథుని రథయాత్ర.. భక్తుల కోలాహలం

Jagannath Rath yatra : అదిగో జగన్నాథుని రథయాత్ర.. భక్తుల కోలాహలం

Sharath Chitturi HT Telugu

01 July 2022, 9:16 IST

google News
  • Jagannath Rath yatra 2022 : దేశవ్యాప్తంగా జగన్నాథ రథయాత్ర ప్రారంభమైంది. భక్తుల కోలాహలంతో ఒడిశా పూరీ వీధులు కిటకిటలాడుతున్నాయి. అధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లను చేశారు.

పూరీలో జగన్నాథుడి రథయాత్ర
పూరీలో జగన్నాథుడి రథయాత్ర (PTI)

పూరీలో జగన్నాథుడి రథయాత్ర

Jagannath Rath yatra : ఒడిశా పూరీలో జగన్నాథ రథయాత్ర.. శుక్రవారం ఉదయం అట్టహాసంగా ప్రారంభమైంది. జగన్నాథ రథచక్రాలను చూసేందుకు.. వేలాది మంది భక్తులు పూరీ చేరుకున్నారు. భక్తుల కోలాహలంతో పూరీ వీధులు సందడిగా మారిపోయాయి.

జగన్నాథుడు, దేవీ సుభద్ర, బాలభద్రల ఊరేగింపు.. రథంపై పూరీ వీధుల్లో జరుగుంది. ప్రతి యేటా.. జూన్​/జులైలోని శుక్ల పక్షంలోని రెండో రోజు ఈ పండుగ జరుగుంది. ఈ ఏడాది జులై 1న జగన్నాథుని రథయాత్ర మొదలైంది. ప్రతియేటా కొత్తగా జగన్నాథ రథాన్ని నిర్మాణిస్తారు. ఈ ఏడాది ఈ పనులు కొన్ని రోజుల క్రితమే పూర్తి అయ్యాయి.

కట్టుదిట్టమైన భద్రత..

కొవిడ్​ కారణంగా రెండేళ్లుగా భక్తులు లేకుండానే జగన్నాథ రథయాత్ర జరిగింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో భక్తులకు ఈసారి అనుమతులు లభించాయి.

Jagannath Rath yatra 2022 : మరోవైపు జగన్నాథుని రథయాత్ర నేపథ్యంలో పూరీలో అధికారులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. సీసీటీవీ కెమెరాలను సైతం ఎక్కడిక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదనపు బలగాలను సైతం అధికారులు సిద్ధం చేశారు.

జగన్నాథ రథయాత్ర సందర్భంగా దేశప్రజలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.

"జగన్నాథుని రథయాత్ర నేపథ్యంలో దేశ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. విష్ణుమూర్తి అవతారంగా భావించే జగన్నాథుడికి రథయాత్ర జరుగుతోంది. సమాజంలోని ప్రజలు ఒక్కటిగా చేరి జగన్నాథుని రథచక్రాలను విక్షిస్తారు. రథయాత్రతో మీ జీవితాల్లో శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను," అని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా..

మరోవైపు దేశవ్యాప్తంగా జగన్నాథ రథయాత్ర వేడుకలు ప్రారంభమయ్యాయి. ఒడిశా తర్వాత గుజరాత్​లో ఈ వేడుకలు ఘనంగా సాగుతాయి. కాగా.. అహ్మదాబాద్​లోని శ్రీ జగన్నాథ మందిరంలో జరిగిన రథయాత్రలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్​ పాల్గొన్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం