తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Isro's Pushpak: ఇస్రో ‘పుష్పక్’ ప్రయోగం విజయవంతం; ఏమిటీ పుష్పక్ స్పెషాలిటీ?

ISRO's Pushpak: ఇస్రో ‘పుష్పక్’ ప్రయోగం విజయవంతం; ఏమిటీ పుష్పక్ స్పెషాలిటీ?

HT Telugu Desk HT Telugu

22 March 2024, 14:57 IST

    • ISRO's Pushpak: వాహక నౌకా ప్రయోగ ప్రస్థానంలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ‘ఇస్రో’ మరో ఘనత సాధించింది. ‘పుష్పక్’ పేరుతో పూర్తి దేశీయంగా రూపొందించిన పునర్వినియోగ వాహక నౌకను శుక్రవారం విజయవంతంగా ప్రయోగించింది.
విజయవంతంగా ల్యాండ్ అయిన పుష్పక్ ఆర్ఎల్వీ
విజయవంతంగా ల్యాండ్ అయిన పుష్పక్ ఆర్ఎల్వీ (X/ISRO)

విజయవంతంగా ల్యాండ్ అయిన పుష్పక్ ఆర్ఎల్వీ

కర్ణాటకలోని చల్లకెరెలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ (ATR) నుంచి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) శుక్రవారం 'పుష్పక్' (Pushpak) అనే రీయూజబుల్ లాంచ్ వెహికల్ (RLV) ల్యాండింగ్ మిషన్ ను విజయవంతంగా నిర్వహించనుంది. ఉదయం 7 గంటలకు చలాకెరె రన్ వే నుంచి రాకెట్ ను ప్రయోగించారు. రామాయణంలోని పుష్పక విమానం స్ఫూర్తిగా ఈ పునర్వినియోగ వాహక నౌక కు ‘పుష్పక్’ అనే పేరు పెట్టారు. ఈ పునర్వినియోగ వాహక నౌక (Reusable Launch Vehicle - RLV ) కు సంబంధించి ఇది మూడో విజయవంతమైన ల్యాండింగ్ మిషన్. గతంలో 2016లో, 2023 ఏప్రిల్ నెలల్లో ఈ అంతరిక్ష ప్రయోగాలు విజయవంతంగా నిర్వహించారు.

4.5 కిలో మీటర్ల ఎత్తు నుంచి..

భారత వైమానిక దళ హెలికాప్టర్ ద్వారా 4.5 కిలోమీటర్ల ఎత్తుకు ఈ ప్రయోగ వాహనాన్ని తీసుకెళ్లి ముందుగా నిర్ణయించిన పిల్ బాక్స్ పారామీటర్లను చేరుకున్న తర్వాత కిందకు విడిచిపెట్టారు. చంద్రయాన్ -3 తర్వాత చంద్రుడిపైకి తక్కువ ఖర్చుతో వెళ్లేందుకు వీలుగా పూర్తిగా పునర్వినియోగ ప్రయోగ వాహనం కోసం అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో భాగమే ఈ మిషన్ (Pushpak) అని ఇస్రో తెలిపింది.

పునర్వినియోగమే లక్ష్యం

అత్యంత చౌకగా, పునర్వినియోగానికి వీలయ్యే వాహక నౌకను అభివృద్ధి చేసి, అందుబాటులోకి తీసుకురావడానికి ఇస్రో చేపట్టిన సాహసోపేతమైన ప్రయత్నం ‘పుష్పక్’ అని ఇస్రో చైర్ పర్సన్ ఎస్ సోమనాథ్ (ISRO chairperson S Somnath) అన్నారు. "ఇది భారతదేశ ఫ్యూచరిస్టిక్ రీయూజబుల్ లాంచ్ వెహికల్. ఇందులోని అత్యంత ఖరీదైన భాగం, అన్ని ఖరీదైన ఎలక్ట్రానిక్స్ కలిగి ఉన్న ఎగువ దశను సురక్షితంగా భూమికి తిరిగి తీసుకురావడం ద్వారా పునర్వినియోగం చేస్తారు. తరువాత దశలో, దీనితో కక్ష్యలో ఉన్న ఉపగ్రహాలకు ఇంధనం నింపే కార్యక్రమం చేపడ్తారు. లేదా, కక్ష్య నుండి ఉపగ్రహాలను తిరిగి తీసుకువచ్చే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నాం. అంతరిక్షంలో వ్యర్థాలను తగ్గించడానికి భారత్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే పుష్పక్ ను రూపొందించాం’’ అని సోమ్ నాథ్ వివరించారు.

పుష్పక్ వివరాలు..

పుష్పక్ అనేది పునర్వినియోగ లాంచ్ వెహకిల్ (Reusable Launch Vehicle - RLV). పూర్తిగా పునర్వినియోగపరచదగిన సింగిల్ స్టేజ్-టు-ఆర్బిట్ (SSTO) వాహనంగా దీనిని రూపొందించారు. ఎక్స్-33 అడ్వాన్స్ డ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్, ఎక్స్-34 టెస్ట్ బెడ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్, అప్ గ్రేడ్ చేసిన డీసీ-ఎక్స్ ఏ ఫ్లైట్ డెమాన్స్ట్రేటర్ వంటి ప్రధాన అంశాలు ఇందులో ఉన్నాయి. 'పుష్పక్'లో ఫ్యూజ్ లేజ్ (BODY), నోస్ క్యాప్, డబుల్ డెల్టా వింగ్స్, ట్విన్ వర్టికల్ టెయిల్స్ ఉంటాయని ఇస్రో తెలిపింది. ఇది ఎలెవోన్స్, రూడర్ అనే చురుకైన నియంత్రణ ఉపరితలాలను కూడా కలిగి ఉంది. ఫిబ్రవరిలో త్రివేండ్రంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ను సందర్శించినప్పుడు రూ.100 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఆర్ ఎల్ వీ మిషన్ గురించి ప్రధాని నరేంద్ర మోదీకి సోమనాథ్ వివరించారు.

తదుపరి వ్యాసం