ISRO GSLV-F14 : ఇస్రో జీఎస్ఎల్వీ-ఎఫ్ 14 ప్రయోగం విజయవంతం, వాతావరణ పరిశీలనకు ఇన్సాట్-3డీఎస్ శాటిలైట్
- ISRO GSLV-F14 :భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) ప్రయోగించిన జీఎస్ఎల్వీ-ఎఫ్14(GSLV-F14) విజయవంతం అయ్యింది. శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు ఇస్రో జీఎస్ఎల్వీ-ఎఫ్ 14 వాహక నౌకను ప్రయోగించింది.

(2 / 7)
తిరుపతి జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు ఇస్రో జీఎస్ఎల్వీ-ఎఫ్ 14 వాహక నౌకను ప్రయోగించింది.
(3 / 7)
జీఎస్ఎల్వీ-ఎఫ్14 వాహక నౌక 2,275 కిలోల బరువున్న ఇన్సాట్-3 డీఎస్(INSAT 3DS) శాటిలైట్ ను నింగిలోకి మోసుకెళ్లింది. ప్రయోగించిన 18.46 నిమిషాల తర్వాత ఈ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. (ISRO Twitter)
(4 / 7)
ఇన్సాట్-3డీఎస్ ఉపగ్రహం వాతావరణ పరిశీలన, భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షణలో మెరుగైన ఫలితాలు అందించేందుకు రూపొందించింది ఇస్రో. ఇన్సాట్-3డీఎస్ శాటిలైట్ వాతావరణ పరిస్థితుల అంచనా, విపత్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరుస్తుంది. (ISRO Twitter)
(5 / 7)
ప్రస్తుతం ఈ కక్షలో పనిచేస్తున్న ఇన్సాట్-3డీ, ఇన్సాట్-3డీఆర్ శాటిలైట్స్ తో కలిసి ఇన్సాట్-3డీఎస్ పనిచేస్తుంది. (ISRO Twitter)
(6 / 7)
జీఎస్ఎల్వీ-ఎఫ్ 14 ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు, సిబ్బందికి ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ అభినందనలు తెలిపారు. (ISRO Twitter)
ఇతర గ్యాలరీలు