తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Isro: ప్రారంభమైన ప్రజ్ఞాన్ రోవర్ ప్రయాణం; వీడియో షేర్ చేసిన ఇస్రో

ISRO: ప్రారంభమైన ప్రజ్ఞాన్ రోవర్ ప్రయాణం; వీడియో షేర్ చేసిన ఇస్రో

HT Telugu Desk HT Telugu

26 August 2023, 19:35 IST

google News
  • ISRO: చంద్రయాన్ 3 ప్రయోగంలో మరో కీలక అంకం ప్రారంభమైంది. చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయిన ల్యాండర్ లో నుంచి చంద్రుడి ఉపరితలంపైకి వచ్చిన ప్రజ్ఞాన్ రోవర్ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ వీడియోను ఇస్రో శనివారం షేర్ చేసింది. 

చందమామపై ప్రజ్ఞాన్ రోవర్ ప్రయాణం
చందమామపై ప్రజ్ఞాన్ రోవర్ ప్రయాణం (ISRO/ X)

చందమామపై ప్రజ్ఞాన్ రోవర్ ప్రయాణం

ISRO: చంద్రయాన్ 3 ప్రయోగంలో మరో కీలక అంకం ప్రారంభమైంది. చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయిన ల్యాండర్ లో నుంచి చంద్రుడి ఉపరితలంపైకి వచ్చిన ప్రజ్ఞాన్ రోవర్ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ వీడియోను ఇస్రో శనివారం షేర్ చేసింది.

శివశక్తి పాయింట్

భారత కాలమానం ప్రకారం ఆగస్ట్ 23 సాయంత్రం 6.04 గంటలకు చంద్రయాన్ 3 లో భాగమైన విక్రం ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దిగింది. ఆ తరువాత, ల్యాండింగ్ సమయంలో రేగిన దుమ్ము, దూళి సెటిల్ అయిన తరువాత, దాదాపు మూడు గంటల అనంతరం, భారత కాలమానం ప్రకారం రాత్రి 9.04 గంటలకు రోవర్ సైడ్ ప్యానెల్ నుంచి ఒక ర్యాంప్ చంద్రుడి మీదకు జారింది. దానిపైనుంచి ప్రజ్ఞాన్ రోవర్ నెమ్మదిగా చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టింది. ఆ తరువాత తనలోని పేలోడ్స్ అన్నింటిని సిద్ధం చేసుకున్న ప్రజ్ఞాన్ రోవర్.. క్రమంగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. చంద్రయాన్ 3 ల్యాండర్ దిగిన ప్రదేశాన్ని శివ శక్తి పాయింట్ గా ప్రధాని మోదీ నామకరణం చేసిన విషయం తెలిసిందే.

8 మీటర్ల ప్రయాణం

శివ శక్తి పాయింట్ వద్ద ప్రజ్ఞాన్ రోవర్ దాదాపు 8 మీటర్ల దూరం నెమ్మదిగా ప్రయాణం సాగించింది. మార్గ మధ్యంలో చంద్రుడి ఉపరితలాన్ని పరిశీలిస్తూ, విశ్లేషిస్తూ ప్రయాణం సాగించింది. ఈ వీడియోను ఇస్రో శనివారం ట్విటర్ లో షేర్ చేసింది. ‘‘చంద్రుడి దక్షిణ ధ్రువంలో దాగిన రహస్యాలను అన్వేషిస్తూ శివశక్తి పాయింట్ చుట్టూ తిరుగుతున్న ప్రజ్ఞాన్ రోవర్’’ అనే కామెంట్ ను కూడా జత చేసింది.

మూడింటిలో రెండు లక్ష్యాలు నెరవేరాయి..

చంద్రయాన్ 3 కి సంబంధించిన మూడు లక్ష్యాలలో ఇప్పటివరకు రెండు లక్ష్యాలు నెరవేరాయని ఇస్రో ప్రకటించింది. చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ కావడమనే తొలి లక్ష్యం కాగా, చంద్రుడి ఉపరితలంపైకి రోవర్ సురక్షితంగా దిగి, ఆ నేలపై తిరగాలన్నది రెండో లక్ష్యం అని వివరించింది. చంద్రుడి ఉపరితలాన్ని, వాతావరణాన్ని, ప్రకంపనాలను, కెమికల్ కాంపొజిషన్ ను శాస్త్రీయంగా విశ్లేషించ డమనే మూడో లక్ష్యం దిశగా ప్రజ్ఞాన్ రోవర్ సాగుతోందని వివరించింది.

తదుపరి వ్యాసం