ISRO Recruitment 2024 : ఇస్రోలో ఉద్యోగాలు.. పదో తరగతి ప్లస్ ఐటీఐతో కూడా ఖాళీలు
26 September 2024, 10:34 IST
- ISRO Recruitment 2024 : ఇస్రోలో ఉద్యోగం చేయాలని చాలా మంది అనుకుంటారు. అలాంటి వారికి మంచి అవకాశం వచ్చింది. పలు పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది.
ఇస్రోలో ఉద్యోగాలు
ఇస్రోలో ఖాళీగా ఉన్న పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 09, 2024గా నిర్ణయించారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌లో ఖాళీగా ఉన్న 103 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ వెలువడింది. గడువు తేదీకి ముందే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
ఖాళీలు
మెడికల్ ఆఫీసర్ - 3, సైంటిస్ట్ ఇంజనీర్ - 10, టెక్నికల్ అసిస్టెంట్- 28, సైంటిఫిక్ అసిస్టెంట్- 1, టెక్నీషియన్-B (ఫిట్టర్)- 22, టెక్నీషియన్-B (ఎలక్ట్రానిక్ మెకానిక్)- 12, టెక్నీషియన్-B (AC మరియు రిఫ్రిజిరేషన్)- 1, టెక్నీషియన్-B- (వెల్డర్) 2, టెక్నీషియన్-B- (మెషినిస్ట్) 1, టెక్నీషియన్-B- (ఎలక్ట్రికల్)- 3, టెక్నీషియన్-B- (టర్నర్) 1, టెక్నీషియన్-B- (గ్రైండర్) 1, డ్రాఫ్ట్స్‌మన్-B- (మెకానికల్)- 9, డ్రాఫ్ట్స్‌మన్-బి- (సివిల్)-4, అసిస్టెంట్- (రాజభాష) 5
అర్హతలు
మెడికల్ ఆఫీసర్- MBBS, M.D, సైంటిస్ట్ ఇంజనీర్- BE లేదా B.Tech లేదా M.Tech, టెక్నికల్ అసిస్టెంట్- డిప్లొమా, సైంటిఫిక్ అసిస్టెంట్- B.Sc, గ్రాడ్యుయేట్, టెక్నీషియన్-B (ఫిట్టర్)- 10వ తరగతి, ITI, టెక్నీషియన్-B (ఎలక్ట్రానిక్ మెకానిక్)- 10వ తరగతి, ITI, టెక్నీషియన్-B (AC & రిఫ్రిజిరేషన్)- 10వ తరగతి, ITI, టెక్నీషియన్-B- (వెల్డర్)- 10వ తరగతి, ITI, టెక్నీషియన్-B- (మెషినిస్ట్)- 10వ తరగతి, ITI, టెక్నీషియన్-B- (ఎలక్ట్రికల్)- 10వ తరగతి, ITI, టెక్నీషియన్-B- (టర్నర్)- 10వ తరగతి, ITI, టెక్నీషియన్-B- (గ్రైండర్)- 10వ తరగతి, ITI, డ్రాఫ్ట్‌మ్యాన్-బి- (మెకానికల్)- 10వ తరగతి, ITI, డ్రాఫ్ట్‌మ్యాన్-B- (సివిల్)- 10వ తరగతి, ITI, అసిస్టెంట్- (రాజభాష)- డిగ్రీ
దరఖాస్తు ఫీజు
కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 35 సంవత్సరాలుగా నిర్ణయించారు. రిజర్వేషన్ ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు సడలింపు ఉంది. దరఖాస్తు రుసుము రూ. 750గా నిర్ణయించారు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
https://cdn.digialm.com/EForms/configuredHtml/1258/90047/Registration.html ఈ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.