IOCL recruitment 2023 : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి ఇలా
28 February 2023, 17:12 IST
- IOCL recruitment 2023 : ఐఓసీఎల్‌లో 106 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రక్రియ మొదలైంది. మార్చ్ 22 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలు..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి ఇలా
IOCL recruitment 2023 : ఐఓసీఎల్ (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్)లో ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ పడింది. కాంట్రాక్ట్ బేసిస్ కింద 106 ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అప్లికేషన్‌ను సమర్పించేందుకు తుది గడువు మార్చ్ 22. ఆసక్తిగల అభ్యర్థులు.. iocl.com లో ఆన్లైన్ ద్వారా అప్లికేషన్‌ను సమర్పించవచ్చు.
ఐఓసీఎల్ రిక్రూట్మెంట్- వేకెన్సీ వివరాలు..
ఈసారి మొత్తం 106 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ పడింది. వీటిల్లో లెవల్ 1 ఎగ్జిక్యూటివ్ పోస్టులు 96 ఉన్నాయి. మిగిలిన 10.. లెవల్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌లు ఉన్నాయి.
ఐఓసీఎల్ రిక్రూట్మెంట్ వయస్సు పరిమితి- లెవల్ 1 ఎగ్జిక్యూటివ్ పోస్టుకు అప్లై చేస్తున్న వారి వయస్సు 35ఏళ్లు మించకూడదు. లెవల్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్టుకు అప్లై చేస్తున్న వారి వయస్సు 45 కన్నా ఎక్కువ ఉండకూడదు.
ఐఓసీఎల్ రిక్రూట్మెంట్- ఇలా అప్లై చేసుకోండి
IOCL recruitment for executive posts : స్టెప్ 1:- www.iocl.com వెబ్సైట్లోకి వెళ్లాలి.
స్టెప్ 2:- కెరీర్ ట్యాబ్ మీద క్లిక్ చేయాలి.
స్టెప్ 3:- అప్లికేషన్ ఫామ్‌ను ఫిల్ చేయాలి.
స్టెప్ 4:- సంబంధిత డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి.
స్టెప్ 5:- అప్లికేషన్ ఫీజ్ చెల్లించాలి.
స్టెప్ 6:- అప్లికేషన్‌ను సబ్మీట్ చేసి, సంబంధిత కాపీని ప్రింటౌంట్ తీసుకోవాలి.
IOCL recruitment 2023 apply online : అభ్యర్థులు.. అప్లికేషన్ ఫామ్‌ను ప్రింటౌట్ తీసుకుని, ఇటీవలే తీసుకున్న పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోను జత చేసి, సంబంధిత పత్రాలను జతచేయాలి. సంతకం చేయాల్సిన చోట సిగ్నేచర్ పెట్టి.. The Advertiser, Lodhi Road, New Delhi 110003. Post Box No. 3096, Head Post Office కు పోస్ట్ చేయాలి. 2024 ఏప్రిల్ 4లోగా అది సంబంధిత అడ్రస్‌కు చేరుకునే విధంగా చూసుకోవాలి.
గెయిల్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు..
GAIL Recruitment 2023 : ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల అప్లికేషన్లకు ఆహ్వానించింది గెయిల్ ఇండియా లిమిటెడ్. అప్లికేషన్ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టు అప్లికేషన్‌కు తుది గడువు మార్చ్ 15. అభ్యర్థులు గెయిల్ అధికారిక వెబ్సైట్ అయిన gailonline.com లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎగ్జిక్యూటివ్ ట్రైనీకి సంబంధించి 47 ఖాళీలకు ప్రస్తుతం రిక్రూట్మెంట్ జరుగుతోంది. వీటిల్లో 20 పోస్టులు.. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (కెమికల్), 11 పోస్టులు ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (సివిల్), 8 పోస్టులు ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (గెయిల్‌టెల్ టీసీ/టీఎం), మరో 8 పోస్టులు ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (బీఐఎస్)కు చెందినవి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.