GAIL Recruitment 2023 : గెయిల్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు.. ఇలా అప్లై చేసుకోండి
GAIL Recruitment 2023 : గెయిల్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్ పడింది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
GAIL Recruitment 2023 : ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల అప్లికేషన్లకు ఆహ్వానించింది గెయిల్ ఇండియా లిమిటెడ్. అప్లికేషన్ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టు అప్లికేషన్‌కు తుది గడువు మార్చ్ 15. అభ్యర్థులు గెయిల్ అధికారిక వెబ్సైట్ అయిన gailonline.com లో దరఖాస్తు చేసుకోవచ్చు.
గెయిల్ లిమిటెడ్ 2023 ఖాళీల వివరాలు..
ఎగ్జిక్యూటివ్ ట్రైనీకి సంబంధించి 47 ఖాళీలకు ప్రస్తుతం రిక్రూట్మెంట్ జరుగుతోంది. వీటిల్లో 20 పోస్టులు.. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (కెమికల్), 11 పోస్టులు ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (సివిల్), 8 పోస్టులు ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (గెయిల్‌టెల్ టీసీ/టీఎం), మరో 8 పోస్టులు ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (బీఐఎస్)కు చెందినవి.
GAIL executive trainee post vacancies : గెయిల్ లిమిటెడ్ 2023 అర్హత :- గెయిల్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుకు దరఖాస్తు చేస్తున్న అభ్యర్థుల వయస్సు 26ఏళ్లకు మించి ఉండకూడదు.
గెయిల్ లిమిటెడ్ 2023- సెలక్షన్ ప్రక్రియ..
గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూట్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్)- 2023 మార్క్‌ల ఆధారంగా ఈ గెయిల్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు.. కెమికల్, సివిల్, గెయిల్‌టెల్ (టీసీ/టీఎం), బీఐఎస్ చదివి ఉండాలి.
గెయిల్ లిమిటెడ్ 2023- ఇలా అప్లై చేసుకోండి..
GAIL executive trainee posts application process : స్టెప్ 1:- గెయిల్ అధికారిక వెబ్సైట్ gailonline.com కు వెళ్లండి.
స్టెప్ 2:- హోం పేజ్‌లో కెరీర్ లింక్ మీద క్లిక్ చేయండి.
స్టెప్ 3:- అప్లికేషన్ ఫామ్‌ను రిజిస్టర్ చేసుకుని ఫిల్ చేయండి.
స్టెప్ 4:- సంబంధిత డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి.
స్టెప్ 5:- ఫీజు చెల్లించి, ప్రింట్అవుట్ తీసుకోండి.