GAIL Recruitment: గెయిల్ లో ఎగ్జిక్యూటివ్ పోస్ట్ లు; లాస్ట్ డేట్ ఎప్పుడంటే?-gail limited recruitment 2023 apply for 277 executive posts at gailonlinecom ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Gail Recruitment: గెయిల్ లో ఎగ్జిక్యూటివ్ పోస్ట్ లు; లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

GAIL Recruitment: గెయిల్ లో ఎగ్జిక్యూటివ్ పోస్ట్ లు; లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

HT Telugu Desk HT Telugu
Jan 25, 2023 02:57 PM IST

GAIL Recruitment: 277 ఎగ్జిక్యూటివ్ పోస్ట్ (Executive posts in GAIL) లకు ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్ (GAIL) నోటిఫికేషన్ విడుదల చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Shutterstock/ Representative photo)

GAIL Limited Recruitment 2023: 277 ఎగ్జిక్యూటివ్ పోస్ట్ లకు ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్ ఇండియా లిమిటెడ్ (GAIL India Limited) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్ట్ ల అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ ఉద్యోగాల కోసం గెయిల్ (GAIL) అధికారిక వెబ్ సైట్ gailonline.com ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

GAIL Limited Recruitment 2023: లాస్ట్ డేట్..

GAIL India Limited లో ఎగ్జిక్యూటివ్ పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 2, 2023. గెయిల్ అధికారిక వెబ్ సైట్ gailonline.com ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ (UR), ఓబీసీ నాన్ క్రీమీలేయర్ కేటగిరీ (OBC NCL), ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (EWS) రూ. 200 లను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు అప్లికేషన్ ఫీ చెల్లించాల్సిన అవసరం లేదు.

GAIL Limited Recruitment 2023: అప్లై చేసుకోవడం ఎలా?

  • GAIL Limited Recruitment 2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ముందుగా గెయిల్ అధికారిక వెబ్ సైట్ gailonline.com ను ఓపెన్ చేయాలి.
  • హోం పేజీలో కెరియర్ (career) లింక్ పై క్లిక్ చేయాలి.
  • స్క్రీన్ పై వచ్చిన అప్లికేషన్ ఫామ్ లోని అన్ని వివరాలను ఫిల్ చేయాలి.
  • అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి.
  • నిర్ధారిత ఫీజును చెల్లించాలి. మినహాయింపు కేటగిరీల్లో ఉన్నవారు ఫీ చెల్లంచాల్సిన అవసరం లేదు.
  • అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకుని, భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసి భద్ర పర్చుకోవాలి.

Direct link to apply

IPL_Entry_Point

టాపిక్