తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Iocl Apprentice Recruitment 2023: ఆయిల్ ఇండియా కార్పొరేషన్ లో అప్రెంటిస్ రిక్రూట్మెంట్; మొత్తం 1820 పోస్ట్ ల భర్తీ

IOCL Apprentice Recruitment 2023: ఆయిల్ ఇండియా కార్పొరేషన్ లో అప్రెంటిస్ రిక్రూట్మెంట్; మొత్తం 1820 పోస్ట్ ల భర్తీ

HT Telugu Desk HT Telugu

13 December 2023, 17:10 IST

google News
    • ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) లో అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 16 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT file)

ప్రతీకాత్మక చిత్రం

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు IOCL అధికారిక వెబ్‌సైట్ iocl.com ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 1820 పోస్టులను భర్తీ చేయనున్నారు.

డిసెంబర్ 16 నుంచి..

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 16 నుంచి IOCL అధికారిక వెబ్‌సైట్ iocl.com ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికిి లాస్ట్ డేట్ జనవరి 5, 2024.

అర్హత, ఎంపిక ప్రక్రియ

పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ముందుగా ఐఓసీఎల్ అధికారిక వెబ్ సైట్ iocl.com లోని నోటిఫికేషన్ ను సమగ్రంగా చదవాలి. విద్యార్హతలు, వయోపరిమితి వివరాలను తెలుసుకోవాలి. దూర విద్యా విధానం ద్వారా, పార్ట్ టైమ్ విధానం ద్వారా, కరస్పాండెన్స్ విధానం ద్వారా విద్యార్హతలు పొందిన అభ్యర్థులు ఈ పోస్ట్ లకు అర్హులు కారు. ఆన్ లైన్ రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది.

అప్రెంటిస్ చేసి ఉంటే..

గతంలో ఏదైనా పరిశ్రమలో ఒక సంవత్సరం లేదా ఆ పైన కాల పరిమితి కలిగిన అప్రెంటిస్ షిప్ ను పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికిి అనర్హులు. ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం అభ్యర్థులు కింద చూపిన లింక్ లోని నోటిఫికేషన్ ను సమగ్రంగా పరిశీలించాలి.

తదుపరి వ్యాసం