తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Instagram New Feature: ఇన్‌స్టాగ్రామ్‌లో సూపర్ ఫీచర్..

Instagram new feature: ఇన్‌స్టాగ్రామ్‌లో సూపర్ ఫీచర్..

HT Telugu Desk HT Telugu

09 November 2022, 14:29 IST

google News
    • Instagram new feature: ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. యూజర్లకు ఇది మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.
కొత్త కొత్త ఫీచర్లను తెస్తున్న ఇన్‌స్టాగ్రామ్
కొత్త కొత్త ఫీచర్లను తెస్తున్న ఇన్‌స్టాగ్రామ్ (AP)

కొత్త కొత్త ఫీచర్లను తెస్తున్న ఇన్‌స్టాగ్రామ్

మెటా యాజమాన్యంలోని ఇన్‌‌స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. యూజర్లకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా షెడ్యూలింగ్ టూల్‌ను ఇంట్రడ్యూస్ చేసింది.

ఇక ప్రొఫెషనల్ అకౌంట్స్ యూజర్స్ ఇన్‌స్టాగ్రామ్‌పై తమ రీల్స్‌ను, ఫోటోలను, పోస్టులను షెడ్యూలింగ్ టూల్ ఉపయోగించడం ద్వారా 75 రోజుల లోపు ఎప్పుడైనా ప్రచురించేందుకు షెడ్యూలు చేసి పెట్టుకోవచ్చు. అంటే నిర్ధిష్ట సమయంలో పోస్ట్ అయ్యేలా టైమ్, తేదీ షెడ్యూలు చేసి పెట్టుకోవచ్చు.

అలాగే ఇన్‌స్టా‌గ్రామ్ ‘అచీవ్‌మెంట్స్’ అనే ఫీచర్ కూడా టెస్ట్ చేస్తున్నట్టు సమాచారం. వారు సాధించిన అచీవ్‌మెంట్స్‌ను అన్‌లాక్ చేస్తూ వెళ్లొచ్చు. యూజర్లు ఇతర క్రియేటర్లతో కలిసి పని చేసేందుకు ఈ ఫీచర్ దోహదపడుతుంది. కలిసి పనిచేస్తూ వారి కమ్యూనిటీని పెంచుకోవచ్చు. వారు వారి రీల్స్ ద్వారా సాధించిన వెసులుబాట్లు, ఎలాంటి ప్రయోజనాలు దక్కించుకోవచ్చు వంటి అంశాలను కూడా ట్రాక్ చేయొచ్చు.

ఇక ఇన్‌స్టాగ్రామ్ మరికొన్ని ఫీచర్లను కూడా టెస్ట్ చేస్తోంది. కంటెంట్ క్రియేటర్లు తమ కంటెంట్ ద్వారా డబ్బులు (మానిటైజేషన్) సంపాదించుకోవడానికి వీలుగా ఓ ఫీచర్ తేనుంది. యూజర్లు క్రియేటర్ల నాన్ ఫంజిబుల్ టోకెన్స్ (ఎన్‌ఎఫ్‌టీ) కొనుగోలు చేయడం ద్వారా క్రియేటర్లకు సపోర్ట్ చేయవచ్చు.

తొలుత ఈ ఫీచర్‌ను యూఎస్‌లో కొందరు క్రియేటర్లతో టెస్ట్ చేయనుంది. భవిష్యత్తులో మరికొన్ని దేశాలకు విస్తరించనుంది.

ఇక మెటా ఇన్‌స్టాగ్రామ్‌పై గిఫ్ట్స్ ఫీచర్‌ కూడా ఇంట్రడ్యూస్ చేస్తోంది. తొలుత రీల్స్‌పై ఇది అప్లై చేస్తుంది. దీని ద్వారా ఫాలోవర్స్ నుంచి క్రియేటర్లు బహుమతులు అందుకోవచ్చు.

తదుపరి వ్యాసం