తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Indonesian Earthquake Death Toll : ఇండోనేషియా భూకంపం ఘటనలో 162 మంది మృతి

Indonesian earthquake death toll : ఇండోనేషియా భూకంపం ఘటనలో 162 మంది మృతి

22 November 2022, 6:39 IST

google News
  • Indonesian earthquake death toll : ఇండోనేషియా భూకంపం ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటివరకు 162 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

భూకంపం ఘటనలో 162కు చేరిన మృతుల సంఖ్య
భూకంపం ఘటనలో 162కు చేరిన మృతుల సంఖ్య (via REUTERS)

భూకంపం ఘటనలో 162కు చేరిన మృతుల సంఖ్య

Indonesian earthquake death toll : ఇండోనేషియా భూకంపం ఘటనలో మృతుల సంఖ్య 162కు చేరింది. వందలాది మంది గాయపడ్డారు. ఈ క్రమంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సహాయక చర్యల్లో పాల్గొన్న అధికారులు.. శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీసేందుకు శ్రమిస్తున్నారు.

భారీగా ప్రాణ, ఆస్తి నష్టం..!

పర్వత ప్రాంతమైన పశ్చిమ జావాలోని సింజూర్​ పట్టణంలో సోమవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. రిక్టార్​ స్కేలుపై భూకంపం తీవ్రత 5.6గా నమోదైంది. ఈ ప్రాంతంలో 2.5మిలియన్​ మంది జీవిస్తున్నారు. భూకంపం ధాటికి అనేక భవనాలు నేలకూలాయి.

Indonesian earthquake : ఇండోనేషియా విపత్త నిర్వహణ సంస్థ ప్రకారం.. భూప్రకంపనల ధాటికి 2,200కుపైగా ఇళ్లు కూలిపోయాయి. 5,300మంది ప్రజలు గల్లంతయ్యారు. శిథిలాల వద్ద సహాయక చర్యలు సోమవారం మధ్యాహ్నం నుంచి జరుగుతూనే ఉన్నాయి. అయితే.. మృతుల సంఖ్య 62గా ఉందని ఇండోనేషియా విపత్త నిర్వహణ సంస్థ చెబుతోంది.

కానీ.. ఇండోనేషియా భూకంపం ఘటనలో 162మంది మరణించినట్టు పశ్చిమ జావా గవర్నర్​ రిడ్వాన్​ కమిల్​ వెల్లడించారు. మరో 326మంది గాయపడినట్టు వివరించారు.

Indonesian earthquake latest update : భూకంపం ధాటికి రోడ్లకు పగుళ్లు వచ్చాయి. అనేక ప్రాంతాల్లో చెట్లు, స్తంభాలు నేలకూలాయి. విద్యుత్​ సరఫరాకు తొలుత తీవ్ర ఆటంకం ఏర్పడగా.. ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడుతున్నట్టు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో.. రవాణా వ్యవస్థ కూడా దెబ్బతింది.

ఇండోనేషియా తాజా భూకంపంతో ఎంత ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందనే విషయంపై అధికారులు ఇంకా ఓ అంచనాకు రాలేకపోతున్నారు.

Indonesian earthquake today : బాధితుల కోసం సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఆహారం, టెంట్లు, దుప్పట్లను రాజధాని జకర్తా నుంచి తెప్పించారు. కానీ చాలా మంది షాక్​లోనే రాత్రిని గడిపారు.

తీవ్ర విషాదం..

ఇండోనేషియా భూకంపం ఘటన మృతుల్లో చాలా మంది స్కూలు విద్యార్థులు ఉన్నారు. పాఠశాల అయిపోయినా.. ఎక్స్​ట్రా క్లాసు కారణంగా వీరు భవనంలోనే ఉండిపోయారు. భూమి కంపించడంతో ఆ భవనం కుప్పకూలిపోయింది.

Earthquake in Indonesia : ఈ ఘటనతో పిల్లల తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకుంటున్నారు. శిథిలాల కింద తమ వారు బతికే ఉంటారని మరికొందరు ఆశలు పెట్టుకున్నారు.

‘పెసిఫిక్​ రింగ్​ ఆఫ్​ ఫైర్​’ మీద ఉండటంతో ఇండోనేషియాలో తరచూ భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి. భూకంపాల ధాటికి ఈ దేశం ఇప్పటికే చాలా కోల్పోయింది. పశ్చిమ సుమాత్ర రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో సంభవించిన భూకంపం ధాటికి 25మంది ప్రాణాలు కోల్పోయారు.

తదుపరి వ్యాసం