Indian student death : లండన్‌లో భారత విద్యార్థిని మృతి- సైక్లింగ్ చేస్తుండగా..
25 March 2024, 11:39 IST
Indian student dies in London : లండన్‌లో చదువుకుంటున్న ఓ భారతీయ మహిళపై నుంచి ఓ ట్రక్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆమె మరణించారు.
లండన్‌లో ప్రాణాలు కోల్పోయిన భారతీయ మహిళ చైస్తా కొచ్చర్..
Cheistha Kochar death reason : సైక్లింగ్ చేస్తుండగా, ట్రక్ ఢీకొట్టడంతో.. లండన్‌లో చదువుకుంటున్న ఓ భారతీయ మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఆమె పేరు చైస్తా కొచ్చర్. ట్రక్ ఢీకొట్టిన సమయంలో ఆమె సైక్లింగ్ చేస్తున్నట్టు సమాచారం. ట్రక్ ఆమెపై నుంచి వెళ్లిందని తెలుస్తోంది.
ఇదీ జరిగింది..
సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) జనరల్ డైరక్టర్, రిటైర్డ్ లుటినెంట్ జనరల్ డా. ఎస్పీ కొచ్చర్ కూతురు చైస్తా కొచ్చర్. 33ఏళ్ల చైస్తా కొచ్చర్.. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో పీహెచ్డీ చదువుకుంటున్నారు.
కాగా.. మార్చ్ 19, చైస్తా కొచ్చర్.. తన భర్తతో కలిసి, ఇంటికి సమీపంలో సైక్లింగ్ చేస్తోంది. అదే సమయంలో.. ఓ గార్బేజ్ ట్రక్, ఆమెను ఢీకొట్టింది. అది చూసిన ఆమె భర్త.. చైస్తా కొచ్చర్‌ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చివరికి.. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచారు.
ఈ విషయాన్ని.. నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్.. ట్విట్టర్ ద్వారా తెలిపారు.
Cheistha Kochar Linkedin : "నీతీ ఆయోగ్ నిర్వహించిన #LIFE ప్రోగ్రామ్‌లో చైస్తా కొచ్చర్.. నాతో కలిసి పనిచేశారు. #NUDGE యూనిట్లో ఉన్న ఆమె.. బిహేవియరల్ సైన్స్‌లో పీహెచ్డీ చేసేందుకు లండన్‌కి వెళ్లారు. కానీ సైక్లింగ్ చేస్తుండగా.. ట్రాఫిక్ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయారు. ఆమె చాలా తెలివైన మనిషి. చాలా తొందరగా ప్రాణాలు కోల్పోయారు. ఆర్ఐపీ," అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు అమితాబ్ కాంత్.
చైస్తా కొచ్చర్ మరణంపై ఆమె తండ్రి రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ డా. ఎస్పీ కొచ్చర్ కూడా స్పందించారు.
"నేను ఇంకా లండన్‌లోనే ఉన్నాను. నా బిడ్డ చైస్తా కొచ్చర్ మృతదేహాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. మార్చ్ 19న సైక్లింగ్ చేస్తుండగా.. ట్రక్ ఆమె మీద నుంచి వెళ్లింది. ఆమె మరణంతో మా మనసులు విరిగిపోయాయి," అని లింక్డిన్లో పోస్ట్ చేశారు రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ డా. ఎస్పీ కొచ్చర్.
Indian student dies in London : 2023 సెప్టెంబర్‌లో లండన్‌కు వెళ్లారు చైస్తా కొచ్చర్. దాని కన్నా ముందు.. ఆమె హరియాణలోని గురుగ్రామ్‌లో నివాసముండేవారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో అడ్మిషన్‌కి ముందు.. ఆమె దిల్లీ యూనివర్సిటీ, అశోక యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, చికాగోల్లో చదువుకున్నారు.