Indian Student dead in UK : లండన్​లో భారత విద్యార్థి మృతి.. వెళ్లిన 3 నెలలకే!-indian student who went missing last month found dead in london river ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Indian Student Dead In Uk : లండన్​లో భారత విద్యార్థి మృతి.. వెళ్లిన 3 నెలలకే!

Indian Student dead in UK : లండన్​లో భారత విద్యార్థి మృతి.. వెళ్లిన 3 నెలలకే!

Sharath Chitturi HT Telugu
Dec 02, 2023 07:20 AM IST

Indian Student dead in UK : కొన్ని నెలల క్రితం లండన్​కు వెళ్లిన ఓ 23ఏళ్ల భారతీయుడు మృతిచెందాడు. నదిలో నుంచి అతని మృతదేహాన్ని బయటకు తీశారు.

లండన్​లో భారత విద్యార్థి మృతి.. వెళ్లిన 3 నెలలకే!
లండన్​లో భారత విద్యార్థి మృతి.. వెళ్లిన 3 నెలలకే!

Indian Student dead in UK : విదేశాల్లో మరో భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. 3 నెలల క్రితం లండన్​కు వెళ్లిన మిత్​కుమార్​ పటేల్​.. గత నెలలో మృతిచెందాడు. అతని మృతదేహాన్ని ఓ నదిలో నుంచి బయటకు తీశారు అధికారులు.

ఇదీ జరిగింది..

23ఏళ్ల మిత్​కుమార్​ పటేల్​ తండ్రి ఓ రైతు. ఉన్నత చదువుల కోసం అతను.. సెప్టెంబర్​ 19న లండన్​కు వెళ్లాడు. కొన్ని రోజుల పాటు అతని బంధువుల ఇంట్లో ఉన్నాడు. నవంబర్​ 20న షెఫీల్డ్​ హాలమ్​ వర్సిటీలో డిగ్రీ కోర్సు ప్రారంభించాల్సి ఉంది. అమెజాన్​లో పార్ట్​టైమ్​ జాబ్​ కూడా లభించింది. కాగా.. నవంబర్​ 17న డైలీ వాక్​కు వెళ్లిన పటేల్​.. తిరిగి ఇంటికి వెళ్లలేదు. అందోళనకు గురైన అతని బంధువులు.. పోలీసులకు సమాచారం అందించారు.

Mitkumar Patel dead in London : కాగా.. ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు.. పటేల్​ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. అదే సమయంలో నవంబర్​ 21న.. అతని మృతదేహాన్ని లండన్​లోని ఓ చెరువులో గుర్తించారు. అతను ఎలా ప్రాణాలు కోల్పోయాడు? అన్న విషయంపై స్పష్టత లేదు. కానీ అతను హత్యకు గురవ్వలేదని, అనుమానాస్పదంగా ఏం జరగలేదని పోలీసులు చెబుతున్నారు.

మరోవైపు.. మిత్​కుమార్​ పటేల్​ కోసం.. అతని బంధువులు లండన్​లో ఫండ్స్​ సేకరిస్తున్నారు. వచ్చిన డబ్బులను అతని కుటుంబానికి ఇవ్వనున్నట్టు వెల్లడించారు. గత వారం వరకు 4,500 జీబీపీ నిధులను సేకరించినట్టు స్పష్టం చేశారు.

అమెరికాలో భారత విద్యార్థి హత్య..

Indian student shot dead in America : విదేశాలకు వెళ్లి ఏదో ఒక రకంగా మరణిస్తున్న భారతీయుల సంఖ్య ఆందోళనకరంగా మారింది. అమెరికాలో మరో భారత విద్యార్థి హత్యకు గురైన ఘటన ఇటీవలే వెలుగులోకి వచ్చింది. కారులో ప్రయాణిస్తుండగా.. ఆదిత్య అనే దిల్లీవాసిపై దుండగులు కాల్పులు జరిపారు.

దిల్లీకి చెందిన ఆదిత్య.. వైద్య విద్య కోసం కొన్నేళ్ల క్రితం అమెరికాకు వెళ్లాడు. ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్​ సిస్సినాటీ మెడికల్​ స్కూల్​లోని మాలిక్యులర్​ అండ్​ డెవలప్​మెంటల్​ బయోలాజీ ప్రోగ్రామ్​లో 4వ ఏడాది చదువుకుంటున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

IPL_Entry_Point

సంబంధిత కథనం