Indian Navy SSC Officers Recruitment 2024 : నేవీలో ఉద్యోగాలు.. అప్లికేషన్ ప్రక్రియ షురూ..
24 February 2024, 11:50 IST
- Indian Navy recruitment 2024 : ఇండియన్ నేవీ ఎస్ఎస్సీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అర్హులైన అభ్యర్థులు joinindiannavy.gov.in దరఖాస్తు చేసుకోవచ్చు.
నేవీలో ఉద్యోగాలు.. అప్లికేషన్ ప్రక్రియ షురూ..
Indian Navy recruitment 2024 apply online : షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులకు నోటిఫికేషన్ జారీ చేసింది ఇండియన్ నేవీ. అర్హులైన అభ్యర్థులు joinindiannavy.gov.in ఇండియన్ నేవీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 254 పోస్టులను భర్తీ చేయనుంది ఇండియన్ నేవీ.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 24న ప్రారంభమవుతుంది. అప్లికేషన్‌కు తుది గడువు.. 2024 మార్చి 10. అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఖాళీల వివరాలు
- ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ : 136 పోస్టులు
- ఎడ్యుకేషన్ బ్రాంచ్ : 18 పోస్టులు
- టెక్నికల్ బ్రాంచ్ : 100 పోస్టులు
అర్హతలు..
Indian Navy SSC Officers Recruitment syllabus : ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బీఈ/బీటెక్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కేడర్ వారీగా విద్యార్హతలు, వయోపరిమితి అందుబాటులో ఉంటాయి.
ఎంపిక విధానం
క్వాలిఫయింగ్ డిగ్రీలో సాధించిన సాధారణ మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఎస్ఎస్బీ ఇంటర్వ్యూకు ఎంపికైన విషయాన్ని ఈ-మెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు. ఖాళీల లభ్యత, సంబంధిత ప్రవేశానికి మెడికల్ క్లియరెన్స్ ఆధారంగా అన్ని ఎంట్రీలకు ఎస్ఎస్బీ మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు. మెడికల్ ఎగ్జామినేషన్‌లో ఫిట్‌గా తేలిన అభ్యర్థులను ఎంట్రీలో ఖాళీల లభ్యతను బట్టి నియమిస్తారు.
బేసిక్ పే
ఎస్ఎల్టీ బేసిక్ పే రూ.56,100/- నుంచి ఇతర అలవెన్సులతో పాటు వర్తిస్తుంది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఇండియన్ నేవీ అధికారిక వెబ్సైట్ చూడవచ్చు.
సెంట్రల్ బ్యాంక్‌లో ఉద్యోగాలు..
3000 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దరఖాస్తులను కోరుతోంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయడానికి మార్చి 6వ తేదీ వరకు గడువు ఉంది. ఫిబ్రవరి 22న ప్రారంభమైందని, దరఖాస్తు ఫారం సమర్పించడానికి మార్చి 6 వరకు గడువు ఉందన్నారు. సెంట్రల్ బ్యాంకులో అప్రెంటిస్షిప్ కోసం దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు www.nats.education.gov.in వెబ్ సైట్ లో అప్రెంటిస్ షిప్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.