తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News : నలుగురు మహిళలపై లైంగిక దాడి- విమానంలో భారతీయ వృద్ధుడి వికృత చేష్టలు..

Crime news : నలుగురు మహిళలపై లైంగిక దాడి- విమానంలో భారతీయ వృద్ధుడి వికృత చేష్టలు..

Sharath Chitturi HT Telugu

26 November 2024, 6:36 IST

google News
  • సింగపూర్ ఎయిర్​లైన్స్​లో అమెరికా నుంచి సింగపూర్​కు వెళ్లిన ఓ 73ఏళ్ల వృద్ధుడు.. విమానంలో నలుగురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు! వారిలోని ఒక మహిళపై ఏకంగా నాలుగుసార్లు వేధింపులకు పాల్పడ్డాడని తెలుస్తోంది.

విమానంలో నలుగురు మహిళలపై లైంగిక దాడి
విమానంలో నలుగురు మహిళలపై లైంగిక దాడి (Representational/ Pixabay)

విమానంలో నలుగురు మహిళలపై లైంగిక దాడి

అమెరికా నుంచి సింగపూర్ వెళ్తున్న సింగపూర్ ఎయిర్​లైన్స్ (ఎస్ఐఏ) విమానంలో జరిగిన ఒక షాకింగ్​ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమాన ప్రయాణంలో.. ఓ 73ఏళ్ల భారతీయ వృద్ధుడు నలుగురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు! సదరు భారతీయుడిపై సింగపూర్ కోర్టు సోమవారం కేసు నమోదు చేసింది.

ఇదీ జరిగింది..

ఈ నెల 18వ తేదీన జరిగిన ఈ ఘటనలో బాలసుబ్రహ్మణ్యం రమేష్ అనే వ్యక్తి.. విమానంలో నలుగురు వేర్వేరు మహిళలను వేధింపులకు గురిచేశాడు. విమానంలో ఓ మహిళపై రమేష్ నాలుగుసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, మరో ముగ్గురిని టార్గెట్ చేశాడని పోలీసులు తెలిపారు. స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదిక ప్రకారం డిస్ట్రిక్ట్​ కోర్టు రమేష్​పై మొత్తం ఏడు లైంగిక వేధింపుల అభియోగాలను నిర్ధారించింది.

అయితే, బాధితులు తోటి ప్రయాణికులా లేక క్యాబిన్ క్రూ సభ్యులా అనేది ఇంకా తెలియరాలేదు. ఇది తర్వాత వెలుగులోకి రావచ్చని, అయితే వారి గుర్తింపును పరిరక్షించడానికి గ్యాగ్ ఆర్డర్ కారణంగా వారి పేర్లు చెప్పలేమని నివేదిక తెలిపింది.

నిందితుడికి శిక్ష..

విమాన ప్రయాణంలో బాధితులంతా వేర్వేరు సమయాల్లో వేధింపులకు గురైనట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున 3:15 గంటలకు మొదటి బాధితురాలిని, ఐదు నిమిషాల తర్వాత రెండో బాధితురాలిని రమేష్​ లైంగికంగా వేధించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. తెల్లవారుజామున 3.30 నుంచి 6 గంటల మధ్య రెండో మహిళపై మరో మూడుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు!

ఉదయం 9:30 గంటల సమయంలో మూడో మహిళ గౌరవానికి భంగం కలిగించాడని, సాయంత్రం 5:30 గంటల సమయంలో నాలుగో మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడని రమేష్​పై అభియోగాలు ఉన్నాయి.

ఈ కేసుపై డిసెంబర్ 13న కోర్టులో మరోమారు విచారణ జరగనుంది. ఆ సమయంలో, రమేషన్​ తన నేరాన్ని అంగీకరించ వచ్చని సమాచారం. శిక్షను అంగీకరించే అవకాశం ఉందని సింగపూర్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

ఒక్కో మహిళపై ప్రతి నేరానికి కోర్టు మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండు శిక్షల కలయికను రమేష్​ పొందవచ్చు. సాధారణంగా మహిళలపై లైంగిక దాడి కేసులను సింగపూర్​ తీవ్రంగా పరిగణిస్తుంది. దోషులకు కర్ర దెబ్బల (కానింగ్​) శిక్ష కూడా విధిస్తుంది. అయితే దీనికి 50ఏళ్ల గరిష్ఠ వయస్సు ఉంది! ఈ నేపథ్యంలో రమేష్​కి ఈ శిక్ష విధించకపోవచ్చని తెలుస్తోంది.

ఓ భారతీయుడు విమానంలో నలుగురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు అన్న ఘటన సింగపూర్​లో కలకలం సృష్టించింది. ఈ వార్త విన్నవారందరు షాక్​కు గురవుతున్నారు.

తదుపరి వ్యాసం