Indian Army recruitment: ఆర్మీలో టెరిటోరియల్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
26 October 2023, 12:51 IST
Indian Army recruitment: ఆర్మీలో టెరిటోరియల్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ jointerritorialarmy.gov.in ద్వారా అప్లై చేయవచ్చు.
ప్రతీకాత్మక చిత్రం
Indian Army recruitment: టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ (Territorial Army Officer) పోస్ట్ ల భర్తీకి ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వయోపరిమితి, విద్యార్హతలు తదితర పూర్తి వివరాల కోసం jointerritorialarmy.gov.in వెబ్ సైట్ ను పరిశీలించాలి.
నవంబర్ 21 వరకు..
టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ (Territorial Army Officer) పోస్ట్ లకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నవంబర్ 21వ తేదీ వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్ట్ లకు సంబంధించిన పరీక్ష డిసెంబర్ 3వ లేదా 4వ వారంలో జరుగుతుంది. డిసెంబర్ తొలి వారంలో jointerritorialarmy.gov.in వెబ్ సైట్ లో అడ్మిట్ కార్డ్స్ అందుబాటులోకి వస్తాయి.
Who can apply?: అర్హతలు, ఇతర వివరాలు..
ఈ టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ పోస్ట్ కు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు నవంబర్ 21,2023 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే, గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ లేదా బోర్డ్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. స్త్రీ, పురుషులు ఈ పోస్ట్ లకు అప్లై చేయవచ్చు. అభ్యర్థులు రూ. 500 లను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అప్లై చేసిన అభ్యర్థులకు డిసెంబర్ 3వ లేదా 4వ వారంలో రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి ప్రిలిమినరీ ఇంటర్వ్యూ బోర్డ్ పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ఇందులో ఉత్తీర్ణత సాధించినవారిని సర్వీస్ సెలక్షన్ బోర్డు, మెడికల్ బోర్డ్ సభ్యులు పరీక్షిస్తారు. అనంతరం, తుది జాబితాను ప్రకటిస్తారు.
How to apply: ఇలా అప్లై చేయండి
ఈ టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ పోస్ట్ కు అప్లై చేసే అభ్యర్థులు ముందుగా..
- అధికారిక వెబ్ సైట్ jointerritorialarmy.gov.in ను సందర్శించాలి.
- Careers ట్యాబ్ ను క్లిక్ చేయాలి. అందులో Join as Officer ను క్లిక్ చేయాలి.
- వ్యక్తిగత వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫామ్ ను ఫిలప్ చేయాలి.
- అవసరమైన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, అప్లికేషన్ ను సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకుని ఒక సాఫ్ట్ కాపీ, ఒక హార్డ్ కాపీని భద్రపర్చుకోవాలి.