తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  India Post Recruitment: ఇండియా పోస్ట్ లో 40 వేల ఉద్యోగాలు; అప్లై చేసుకోండిలా..

India Post Recruitment: ఇండియా పోస్ట్ లో 40 వేల ఉద్యోగాలు; అప్లై చేసుకోండిలా..

HT Telugu Desk HT Telugu

27 January 2023, 17:13 IST

google News
    • India Post Recruitment: దేశ వ్యాప్తంగా పోస్టల్ సేవలను అందించే ఇండియా పోస్ట్ (India Post) లో భారీ రిక్రూట్ మెంట్ కు తెరలేచింది. మొత్తం 40,889 పోస్ట్ ల భర్తీకి ఇండియా (India Post) పోస్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

India Post Recruitment: ఇండియా పోస్ట్ (India Post) లో మొత్తం 40,889 పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. అందులో గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevaks GDS), బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (Branch Postmaster BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (Assistant Branch Postmaster ABPM) తదితర పోస్ట్ లున్నాయి.

India Post jobs application: జనవరి 27 నుంచే..

ఇండియా పోస్ట్ (India Post jobs) లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ జనవరి 27 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఉద్యోగాలకు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 16 వరకు ఈ ఉద్యోగాలకు (India Post jobs) దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ ద్వారానే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు గానూ అధికారిక వెబ్ సైట్ indiapostgdsonline.gov.in ను సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తుల్లో ఏవైనా తప్పులుంటే ఫిబ్రవరి 17 నుంచి ఫిబ్రవరి 19 వరకు ఆ తప్పులను సరి చేసుకునే అవకాశం లభిస్తుంది.

India Post Recruitment: విద్యార్హత 10వ తరగతి

ఇంగ్లీష్, గణితం కచ్చితమైన సబ్జెక్టులుగా గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఇండియా పోస్ట్ (India Post jobs) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయ: పరిమితి 18 ఏళ్ల నుంచి 40 సంవత్సరాలు. ఈ ఇండియా పోస్ట్ ఉద్యోగాలకు (India Post jobs) దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ. 100 అప్లికేషన్ ఫీ గా చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

Apply to India Post Recruitment: అప్లై చేసుకోవడం ఎలా?

  • ముందుగా ఇండియా పోస్ట్ (India Post) అధికారిక వెబ్ సైట్ indiapostgdsonline.gov.in ను ఓపెన్ చేయాలి.
  • వ్యక్తిగత వివరాలను ఫిల్ చేసి, రిజిస్టర్ చేసుకోవాలి.
  • ఆ తరువాత అప్లికేషన్ ఫామ్ ను ఓపెన్ చేసి, ఆన్ లైన్ లోనే ఆ ఫామ్ లో వివరాలను నింపాలి.
  • విద్యార్హతలు, ఇతర అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి.
  • అప్లికేషన్ ఫీజును కూడా ఆన్ లైన్ లోనే చెల్లించాలి.
  • అనంతరం అప్లికేషన్ ను సబ్మిట్ చేయాలి. భవిష్యత్ అవసరాల కోసం ఆ అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని పెట్టుకోవాలి.
  • అప్లై చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ Direct link to apply
  • నోటిఫికేషన్ కోసం here క్లిక్ చేయండి.

తదుపరి వ్యాసం