ICICI Bank hikes FD rates: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన ఐసీఐసీఐ
26 September 2022, 15:01 IST
ICICI Bank hikes FD rates: ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది.
ICICI Bank has increased interest rates for term deposits below ₹2 crore and those between ₹2 crore and ₹5 crore.
ICICI Bank hikes FD rates: ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. కొత్త రేట్లు ఈ రోజు నుండి అంటే సెప్టెంబర్ 26, 2022 నుండి అమలులోకి వస్తాయి.
1. ఐసీఐసీఐ బ్యాంక్ ఏడు రోజుల నుండి 29 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 2.75 శాతం వడ్డీ రేటును అందించడం కొనసాగిస్తుంది.
2. ముఫ్ఫై రోజుల నుంచి 90 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేటు 3.25 శాతంగా కొనసాగుతుందని
3. మరోవైపు 91 రోజుల నుండి 184 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లు మునుపటి రేటు 3.75 శాతం నుండి 4 శాతానికి సవరించిన వడ్డీ రేటును అందిస్తాయి.
4. ఐసీఐసీఐ బ్యాంక్ 185 రోజుల నుండి ఒక సంవత్సరం కంటే తక్కువ వ్యవధిలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.65 శాతం వడ్డీ రేటును అందించడం కొనసాగిస్తుంది.
5. ఒక సంవత్సరం నుండి రెండేళ్లలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.50 శాతం వడ్డీ రేటు ఉంటుంది.
6. రెండు సంవత్సరాల 1 రోజు నుండి మూడు సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.60 శాతం వడ్డీ రేటు ఉంటుంది.
7. ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 2 కోట్ల నుండి రూ. 5 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంక్ వడ్డీ రేట్లను సవరించింది. ఏడు నుండి 29 రోజులలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేటు 3.75 శాతం కాగా, 30 రోజుల నుండి 45 రోజులలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 3.90 శాతం వడ్డీ రేటు ఉంటుంది.
8. 46 రోజుల నుంచి 60 రోజుల వ్యవధిలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.25 శాతం వడ్డీ రేటు ఉండగా, 61 రోజుల నుంచి 90 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే వాటికి 5 శాతం వడ్డీ రేటు ఉంటుంది.
9. ఐసీఐసీఐ బ్యాంక్ 91 రోజుల నుండి 120 రోజులు, 121 రోజుల నుండి 150 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.50 శాతం వడ్డీ రేటు వర్తింపజేస్తుంది.
ఇతర బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఎస్‌బీఐ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను సాధారణ ప్రజలకు, సీనియర్ సిటిజన్‌లకు రూ. 2 కోట్ల కంటే తక్కువ టర్మ్ డిపాజిట్ల కోసం ఆగస్టు 13న వడ్డీ రేట్లను సవరించింది. ఏడు రోజుల నుండి 45 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 2.90 శాతం, సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 3.40 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంది.
46 రోజుల నుండి 179 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లు సాధారణ కస్టమర్లు, సీనియర్ సిటిజన్‌లకు వరుసగా 3.90 శాతం, 4.40 శాతం ఆఫర్‌ను కొనసాగిస్తున్నాయి.
అయితే, 180 రోజుల నుంచి 210 రోజుల వ్యవధిలో మెచ్యూరిటీ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు సాధారణ కస్టమర్లకు 4.55 శాతానికి, సీనియర్ సిటిజన్లకు 5.05 శాతానికి పెంచారు.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్: ఆగస్టు 18న రూ. 2 కోట్ల కంటే తక్కువ టర్మ్ డిపాజిట్లపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వడ్డీ రేట్లను సవరించింది. 7 నుంచి 14 రోజుల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేటు 2.75 శాతంగా నిర్ణయించింది. సీనియర్ సిటిజన్లకు 3.25 శాతం చెల్లిస్తుంది. 15 నుండి 29 రోజులలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేటు 2.75 శాతం కాగా సీనియర్ సిటిజన్లకు 3.25 శాతం చెల్లిస్తుంది.
30 నుంచి 45 రోజుల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేటు 3.25 శాతం కాగా సీనియర్ సిటిజన్లకు 3.75 శాతంగా నిర్ణయించారు.