ICAI Result Date 2024: సీఏ ఫౌండేషన్, ఇంటర్ సెప్టెంబర్ రిజల్ట్స్ డేట్ ప్రకటించారు..
26 October 2024, 21:29 IST
- ICAI Result Date 2024: సీఏ ఫౌండేషన్, ఇంటర్ సెప్టెంబర్ రిజల్ట్స్ ను విడుదల చేసే తేదీని ప్రకటించారు. సీఏ ఫౌండేషన్, ఇంటర్ సెప్టెంబర్ రిజల్ట్స్ అక్టోబర్ 30 వ తేదీన వెలువడనున్నాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, రోల్ నంబర్ ఉపయోగించి ఫలితాలను చెక్ చేయవచ్చు.
సీఏ ఫౌండేషన్, ఇంటర్ సెప్టెంబర్ రిజల్ట్స్
ఐసీఏఐ సీఏ ఫలితాలు 2024: ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) చార్టర్డ్ అకౌంటెన్సీ (CA) సెప్టెంబర్ పరీక్ష ఫలితాలను వెల్లడించే తేదీని ప్రకటించింది. సీఏ ఫౌండేషన్, ఇంటర్ ఫలితాలను అక్టోబర్ 30న విడుదల చేయనున్నట్లు సంస్థ తెలిపింది. అభ్యర్థులు తమ ఫలితాలను రిజిస్ట్రేషన్ నంబర్, రోల్ నంబర్ ఉపయోగించి ఐసీఏఐ అధికారిక వెబ్ సైట్ icai.nic.in లో చూసుకోవచ్చు.
గత నెలలో పరీక్షలు
2024 సెప్టెంబర్లో నిర్వహించిన చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇంటర్మీడియట్, ఫౌండేషన్ పరీక్షల ఫలితాలను 2024 అక్టోబర్ 30 బుధవారం ప్రకటించే అవకాశం ఉందని, వాటిని అభ్యర్థులు icai.nic.in వెబ్సైట్లో చూడవచ్చని అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నారు. చార్టర్డ్ అకౌంటెన్సీ ఫౌండేషన్ పరీక్ష సెప్టెంబర్ ఎడిషన్ సెప్టెంబర్ 13, 15, 18, 20 తేదీల్లో జరిగింది. గ్రూప్-1 అభ్యర్థులకు సీఏ ఇంటర్మీడియట్ పరీక్ష సెప్టెంబర్ 12, 14, 17 తేదీల్లో జరిగింది. గ్రూప్-2కు సెప్టెంబర్ 19, 21, 23 తేదీల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహించారు.
ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
- ఐసీఏఐ అధికారిక వెబ్ సైట్ icai.nic.in. ను ఓపెన్ చేయండి.
- సీఏ ఫౌండేషన్ లేదా సీఏ ఇంటర్ రిజల్ట్ లింక్ ఓపెన్ చేయాలి.
- మీ రోల్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు నమోదు చేసి, ఎంటర్ నొక్కండి.
- మీ ఫలితాన్ని చెక్ చేసుకోండి.
జూన్ ఫలితాల్లో 14 శాతం ఉత్తీర్ణత
మొత్తం 91,900 మంది అభ్యర్థులు సీఏ ఫౌండేషన్ జూన్ పరీక్షకు హాజరుకాగా, వారిలో 13,749 మంది (14.96 శాతం) మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఆ పరీక్షకు 48,580 మంది పురుషులు హాజరుకాగా 7,766 మంది ఉత్తీర్ణత సాధించారు. పురుషుల ఉత్తీర్ణత శాతం 15.66గా ఉంది. జూన్ పరీక్షలో మహిళా అభ్యర్థుల సంఖ్య 42,230. వీరిలో 5983 మంది (14.14 శాతం) ఉత్తీర్ణత సాధించారు.