తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Iaf Agniveervayu Recruitment: వైమానిక దళంలో అగ్నివీరుల నియామకాలకు నోటిఫికేషన్; ఇలా అప్లై చేసుకోండి..

IAF Agniveervayu Recruitment: వైమానిక దళంలో అగ్నివీరుల నియామకాలకు నోటిఫికేషన్; ఇలా అప్లై చేసుకోండి..

HT Telugu Desk HT Telugu

17 January 2024, 14:29 IST

google News
    • IAF Agniveervayu Recruitment: భారత వైమానిక దళంలో అగ్ని వీరుల (IAF Agniveervayu) నియామకానికి నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ agnipathvayu.cdac.in. ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

IAF Agniveervayu Recruitment: భారత వైమానిక దళం (IAF)లో అగ్నివీరుల రిక్రూట్మెంట్ కు (Agniveervayu Recruitment) రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఐఏఎఫ్ లో అగ్నివీరులుగా చేరాలనుకునే అభ్యర్థులు జనవరి 17వ తేదీ నుంచి ఫిబ్రవరి 6 వ తేదీ వరకు ఆన్ లైన్ లో అధికారిక వెబ్ సైట్ agnipathvayu.cdac.in. ద్వారా అప్లై చేసుకోవచ్చు.

ఎగ్జామ్ మార్చి 17న..

భారత వైమానిక దళం (IAF)లో అగ్నివీర్ వాయు (Agniveervayu Recruitment) పోస్ట్ లకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఫిబ్రవరి 6.కాగా, అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఉద్దేశించిన ఆన్ లైన్ పరీక్షలు మార్చి 17వ తేదీ నుంచి జరుగుతాయి. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఇంటర్మీడియట్/10+2/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. జనవరి 2, 2004 నుంచి జూలై 2, 2007 మధ్య జన్మించనవారే ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి అర్హులు అన్న విషయం గుర్తుంచుకోవాలి.

పరీక్ష ఫీజు

ఈ పోస్ట్ లకు అప్లై చేసే అభ్యర్థులు రూ. 550 లను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. జీఎస్టీ అదనం. ఈ ఫీజును అప్లికేషన్ ఫామ్ ను నింపుతున్న సమయంలో ఆన్ లైన్ లో చెల్లించాలి. డెబిట్ కార్డులు/ క్రెడిట్ కార్డులు/ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, తదితర విధానాల ద్వారా ఈ ఫీజును చెల్లించవచ్చు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఐఏఎఫ్ అధికారిక వెబ్సైట్ ను చూడవచ్చు.

ఇలా అప్లై చేయండి..

  • ముందుగా ఐఏఎఫ్ అగ్నివీర్ అధికారిక వెబ్ సైట్ agnipathvayu.cdac.in ను ఓపెన్ చేయాలి.
  • హోమ్ పేజీలో కనిపిస్తున్న రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయండి.
  • అభ్యర్థులు అప్లై చేసుకునేందుకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • అప్లికేషన్ ఫామ్ నింపి ఫీజు చెల్లించాలి.
  • సబ్మిట్ పై క్లిక్ చేసి పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.
  • తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని భద్రపర్చుకోండి.

తదుపరి వ్యాసం