తెలుగు న్యూస్  /  National International  /  How To Identify Future Multibagger Stocks

మల్టీబ్యాగర్​ స్టాక్స్​ను ముందే గుర్తించి .. భారీ లాభాలు పొందడం ఎలా?

HT Telugu Desk HT Telugu

05 April 2022, 17:20 IST

    • Multibaggar stocks news | మల్టీబ్యాగర్​ స్టాక్స్​లో పెట్టుబడి పెట్టాలని ఎవరికి ఉండదు చెప్పండి! కానీ అవి భారీగా పెరిగి, చివరి దశలో ఉన్నప్పుడే సాధారణ ప్రజలకు సమాచారం అందుతుంది. మరి మల్టీబ్యాగర్​ స్టాక్స్​ను ముందే గుర్తించి.. భారీగా లాభాలు పొందడం సాధ్యమేనా? అంటే.. ముమ్మాటికీ సాధ్యమే. అది ఎలా అంటే..
మల్టీబ్యాగర్​ స్టాక్స్​ కోసం వీటిని గమనించాలి..!
మల్టీబ్యాగర్​ స్టాక్స్​ కోసం వీటిని గమనించాలి..! (Bloomberg)

మల్టీబ్యాగర్​ స్టాక్స్​ కోసం వీటిని గమనించాలి..!

Multibagger stocks | మల్టీబ్యాగర్​ స్టాక్​.. ఈ పేరు వింటే చాలు.. ఇన్​వెస్టర్లకు, ట్రేడర్లకు ఎక్కడ లేని జోష్​ వచ్చేస్తుంది. అందుకు తగ్గట్టుగానే మల్టీబ్యాగర్​ స్టాక్స్​ కూడా తక్కువ సమయంలోనే అధిక లాభాలను తెచ్చిపెడతాయి. అలాంటి మల్టీబ్యాగర్​ స్టాక్స్​లో పెట్టుబడులు పెట్టాలని చాలా మంది భావిస్తుంటారు. ఇక్కడే వచ్చింది అసలు చిక్కు! ముఖ్యంగా కొత్తగా మార్కెట్​లోకి వచ్చినవారు.. మల్టీబ్యాగర్​ స్టాక్స్​ను పసిగట్టేందుకు చాలా కష్టపడుతూ ఉంటారు. సోషల్​ మీడియా, టీవీ న్యూస్​ ఛానెళ్లల్లో చెప్పినా.. మనం పెట్టుబడులు పెట్టేసరికి.. వాటి పరుగు నెమ్మదించిపోతుంది. ఒక్కోసారి అక్కడి నుంచి కిందపడిపోతూ ఉంటాయి. మరి ఓ స్టాక్​కు​.. మల్టీబ్యాగర్​ గుర్తింపు రాకముందే ఎలా పసిగట్టొచ్చు? తద్వారా మంచి లాభాలను ఎలా ఆర్జించవచ్చు? అన్నవి ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

Brij Bhushan : బ్రిజ్​ భూషణ్​ కుమారుడికి బీజేపీ టికెట్​- రెజ్లర్ల స్పందన ఇది..

US Presidential Election 2024: ‘‘మళ్లీ జో బైడెన్ గెలుస్తారు’’- అమెరికా అధ్యక్ష ఎన్నికలపై 'నోస్ట్రాడమస్' జోస్యం

ఓ స్టాక్​.. మల్టీబ్యాగర్​గా మారేందుకు అనేక కారణాలు ఉంటాయి. ఉదాహరణకు ఐఆర్​సీటీసీ.. ఓ మల్టీబ్యాగర్​ స్టాక్​. మార్కెట్​లో ఐఆర్​సీటీసీకి గుత్తాధిపత్యం ఉండటమే ఇందుకు కారణం. ఇదే విధంగా.. మరికొన్ని కీలక విషయాలు ఉన్నాయి. అవేంటంటే..

ఆర్​ఓసీఈ

Multibagger stocks India | ఆర్​ఓసీఈ అంటే.. రిటర్న్​ ఆన్​ క్యాపిటల్​ ఎంప్లాయిడ్​. సింపుల్​గా చెప్పాలంటే.. సంస్థలో పెట్టిన మూలధనానికి ఎంత రిటర్న్​ వస్తోంది? అనే విషయాన్ని లెక్కించడం. ఆర్​ఓసీఈ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది.

ఓ కంపెనీ.. ఎప్పటికప్పుడు ఆదాయాన్ని పెంచుకుంటూపోతుంటే.. అది మంచి విషయమే. అయితే.. ఆర్​ఓసీఈ తగ్గకుండా.. ఎప్పటికప్పుడు ఆదాయం పెంచుకుంటున్న కంపెనీల షేర్లు.. మల్టీబ్యాగర్​లుగా మారే అవకాశం ఉంది.

క్యాష్​ ఫ్లో

కంపెనీ కార్యకలాపాలను సాగించేందుకు నిధులను ఎంత మేర పంపిస్తున్నామో చెప్పేదే క్యాష్​ ఫ్లో. భవిష్యత్తులో.. కంపెనీకి ఆదాయం పెరుగుతుందా? లేదా? అన్నది ఈ క్యాష్​ ఫ్లో స్టేట్​మెంట్లు చెబుతాయి. మాటిమాటికి కంపెనీలోకి క్యాష్​ ఫ్లో అవుతూ ఉంటే.. కార్యకలాపాల నుంచి వచ్చిన ఆదాయం.. కంపెనీ ఖర్చులకు సరిపోవడం లేదని అర్థం. అదే జరిగితే.. ఆ కంపెనీ తరచూ అప్పులు చేస్తూ ఉండాలి. లేకపోతే ఈక్వీటీనైనా అమ్ముకోవాల్సి ఉంటుంది.

మల్టీబ్యాగర్​ కంపెనీలు.. లాభాలతో పాటు ఆపరేటింగ్​ క్యాష్​ఫ్లోలను కాంపౌండింగ్​ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయి. తద్వారా.. భవిష్యత్తులో ఇతర సంస్థల కన్నా వేగంగా అభివృద్ధి చెందే అవకాశం వీటికి ఉంటుంది.

అయితే.. ఇక్కడ ఒక సమస్య ఉంది. కంపెనీ క్యాష్​ ఫ్లోలు, ఆదాయాలు ఎక్కువగానే ఉన్నా.. కొన్నిసార్లు అభివృద్ధి పరంగా అవి నెమ్మదిస్తూ ఉంటాయి(ఉదా- కొత్త కస్టమర్లను ఆకట్టుకోలేకపోతే..). వాటిల్లో పెట్టుబడులకు మంచి రిటర్నులు రాకపోవచ్చు.

నిధుల కేటాయింపులు..

Multibaggar stocks meaning | మల్టీబ్యాగర్​ కంపెనీలకు అంచనాలకు మించిన ఫ్రీ క్యాష్​ ఉంటుంది. అంటే మంచి ఆదాయాలు వస్తుంటాయి. ఆర్​ఓసీఈ చాలా బాగా ఉంటుంది. అదే సమయంలో క్యాష్​ ఫ్లోలు కూడా సంస్థ అభివృద్ధికి తగ్గట్టుగానే ఉంటాయి. కానీ ఇలా ఉన్న కంపెనీలన్నీ మల్టీబ్యాగర్​లు కాలేవు. దానికి ముఖ్యకారణం.. నిధుల కేటాయింపు.

నిధుల కేటాయింపుతోనే మంచి కంపెనీకి.. మల్టీబ్యాగర్​ కంపెనీకి మధ్య ఉన్న వ్యత్యాసం తెలిసిపోతుంది. నిధులను సక్రమంగా వినియోగించి మరింత ఆదాయాన్ని జెనరేట్​ చేయగలిగే సంస్థలకు మల్టీబ్యాగర్​లుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

కొన్ని కంపెనీలు.. పెట్టుబడుల్లో తీసుకునే తప్పుడు నిర్ణయాల కారణంగా డీలా పడుతూ ఉంటాయి. తద్వారా.. మిగిలినవి అన్నీ సరిగ్గా ఉన్నా.. మల్టీబ్యాగర్​ గుర్తింపు తెచ్చుకోలేకపోతాయి.

కంపెనీల పర్ఫార్మెన్స్​లను పరిశీలించేందుకు వివిధ వెబ్​సైట్​లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఎప్పటికప్పుడు చెక్​ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

గమనిక: ఇది కేవలం సమాచారం కోసం రాసిన ఆర్టికల్​ మాత్రమే. ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. నిర్ణయాలైనా తీసుకునే ముందు.. మీ ఫైనాన్షియల్​ ఎడ్వైజర్​ను సంప్రదించడం ఉత్తమం.

టాపిక్