తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Himachal Rains: భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ లో 130 మందికి పైగా మృతి

Himachal rains: భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ లో 130 మందికి పైగా మృతి

HT Telugu Desk HT Telugu

20 July 2023, 14:31 IST

google News
  • Himachal rains: ఈ సారి నైరుతి రుతుపవన వర్షాల కారణంగా అత్యంత దారుణంగా నష్టపోయిన రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. దాదాపు గత 26 రోజులుగా ఇక్కడ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడడం.. తదితర కారణాల వల్ల రాష్ట్రంలో గత 26 రోజుల్లో 130 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

మనాలిలో భారీ వర్షాలు, వరదలతో ధ్వంసమైన రోడ్డు
మనాలిలో భారీ వర్షాలు, వరదలతో ధ్వంసమైన రోడ్డు

మనాలిలో భారీ వర్షాలు, వరదలతో ధ్వంసమైన రోడ్డు

Himachal rains: ఈ సంవత్సరం హిమాచల్ ప్రదేశ్ లో రికార్డు స్థాయిలో వర్షాలు (Himachal pradesh rains) కురిశాయి. రాష్ట్రంలోని నదులు ఉప్పొంగి ప్రవహించాయి. నదీ పరివాహక ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. పర్వత ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడి ప్రాణాలు తీశాయి.

ప్రాణనష్టం, ఆస్తి నష్టం

భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడడం.. తదితర కారణాల వల్ల హిమాచల్ ప్రదేశ్ లో గత 26 రోజుల్లో 130 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ తెలియడం లేదు. 153 మంది గాయాల పాలయ్యారు. బుధవారం ఒక్కరోజే ఐదుగురు చనిపోయారు. వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడడం వంటివాటి వల్ల రాష్ట్రంలో 572 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 4703 ఇళ్లు, 148 దుకాణాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. 1286 గోశాలలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. భారీగా పంటనష్టం వాటిల్లింది.

ముప్పు ఇంకా ఉంది..

అయితే, హిమాచల్ ప్రదేశ్ లో వర్షం ముప్పు ఇంకా పూర్తిగా ముగియలేదని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వర్ష సంబంధ సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, సహాయ బృందాలను అవసరమైన ప్రాంతాలకు పంపించామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడడం వంటి ఘటనల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్రం నుంచి రెండు బృందాలు రాష్ట్రానికి వచ్చాయి. వారు మండి, సోలన్ జిల్లాల్లో నష్టాన్ని అంచనా వేసే పనిలో ఉన్నారు. రాష్ట్ర అధికారుల అంచనా ప్రకారం హిమాచల్ ప్రదేశ్ లో ఈ వర్షాల కారణంగా రూ. 4808.79 ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ సంవత్సరం వర్షాకాలంలో రాష్ట్రంలో 61 కొండచరియలు విరిగి పడిన ఘటనలు, 44 ఆకస్మిక వరదలు ముంచెత్తిన ఘటనలు చోటు చేసుకున్నాయని వెల్లడించారు.

తదుపరి వ్యాసం