తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Himachal Assembly Elections : ఈ స్థానాల్లో హోరాహోరీ పోరు.. గెలుపెవరిది?

Himachal Assembly elections : ఈ స్థానాల్లో హోరాహోరీ పోరు.. గెలుపెవరిది?

12 November 2022, 8:23 IST

  • Himachal Pradesh Assembly elections 2022 : హిమచల్​ ప్రదేశ్​ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. పలు కీలక నియోజకవర్గాల్లో బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

హిమాచల్​ ప్రదేశ్​ ఎన్నికల్లో గెలుపెవరిది?
హిమాచల్​ ప్రదేశ్​ ఎన్నికల్లో గెలుపెవరిది?

హిమాచల్​ ప్రదేశ్​ ఎన్నికల్లో గెలుపెవరిది?

Himachal Pradesh Assembly elections 2022 : 68 స్థానాల హిమాచల్​ ప్రదేశ్​ అసెంబ్లీకి శనివారం ఉదయం పోలింగ్​ ప్రారంభమైంది. 55లక్షలకుపైగా మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని.. 412మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు. ఈ క్రమంలో.. హిమాచల్​ ప్రదేశ్​లోని పలు కీలక నియోజకవర్గాలు, అక్కడి అభ్యర్థుల మధ్య నెలకొన్న హోరీహోరీ పోరు గురించి తెలుసుకుందాము.

సెరాజ్​:- సీఎం జై రామ్​ ఠాకూర్​ను ఇక్కడ బరిలో దింపింది బీజేపీ. కాంగ్రెస్​ తరఫున చెత్రమ్​ ఠాకూర్​లో పోటీలో ఉన్నారు. సీపీఐ-ఎం.. మహీందర్​ రాణాను బరిలో నిలబెట్టింది.

హరోలీ:- హరోలీలో రామ్​ కుమార్​ని బరిలో నిలిపింది కమలదళం. కాంగ్రెస్​ నుంచి ముకేశ్​ అగ్నిహోత్రి పోటీలో దిగారు. ఇదే సీటు నుంచి ముకేశ్​ పోటీ చేయడం ఇది 5వ సారి.

Himachal Pradesh elections live updates : నదౌన్​:- నదౌన్​లో విజయ్​ అగ్నిహోత్రిని ఎన్నికల్లో నిలబెట్టింది బీజేపీ. కాంగ్రెస్​ తరఫున పార్టీ మాజీ చీఫ్​ సుఖ్​విందర్​ సింగ్​ సుఖు బరిలో ఉన్నారు.

డల్హౌజి:- ఇక్కడ త్రిముఖ పోరు నెలకొంది. కాంగ్రెస్​ తరఫున ఆశా కుమార్​, బీజేపీ నుంచి డీఎస్​ ఠాకూర్​, ఆప్​ నుంచి మనీశ్ సరీన్​ బరిలో నిలిచారు.

దారంగ్​:- బీజేపీకి చెందిన పూరన్​ చంద్​ ఠాకూర్​.. కాంగ్రెస్​ సీనియర్​ నేత కౌల్​ సింగ్​ ఠాకూర్​, ఆప్​ అభ్యర్థి సునితా ఠాకూర్​లతో ఇక్కడ పోటీ పడనున్నారు.

శిమ్లా రూరల్​:- మాజీ సీఎం వీరభద్ర సింగ్​ తనయుడు విక్రమాదిత్య సింగ్​.. కాంగ్రెస్​ తరఫున ఇక్కడ పోటీలో నిలిచారు. రవి మెహ్తాను బరిలో దింపింది బీజేపీ.

శిమ్లా అర్బన్​:- ఇక్కడ మొత్తం నలుగురు బరిలో ఉన్నారు. బీజపీ సంజయ్​ సూద్​, కాంగ్రెస్​ హరీశ్​ జనార్థ, ఆప్​ చమన్​ రాకేశ్​ అజ్త, సీపీఐఎం టికేందర్​ సింగ్​ పవార్​ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

Himachal Pradesh polling : నౌపూర్​:- ఇక్కడ కొత్త అభ్యర్థి రన్వీర్​ సింగ్​ రంగంలోకి దింపింది బీజేపీ. కాంగ్రెస్​ నేత అజయ్​ మహాజన్​, ఆప్​ అభ్యర్థి మనీషి కుమారితో ఈయన పోటీపడుతున్నారు.

ప్రజలు ఎవరి పక్షం..?

2017 హిమాచల్​ ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 43 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్​ 22 చోట్ల గెలిచింది. ఒక స్వతంత్ర అభ్యర్థి, ఒక సీపీఎం ఎమ్మెల్యేలు సైతం విజయం సాధించారు.

అయితే.. 20స్థానాల్లో గెలుపోటముల వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది. ఆయా స్థానాల్లో సుమారు 3వేల ఓట్ల తేడాతో అభ్యర్థుల తలరాతలు మారిపోయాయి. ఈ 20 స్థానాల్లోని 6 సీట్లలో మెజారిటీ 1000, అంతకన్నా తక్కువగానే ఉండటం గమనార్హం. ఇక 34 నియోజకవర్గాల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన అభ్యర్థుల మధ్య ఓట్ల వ్యత్యాసం 5000, అంతకన్నా తక్కువగా ఉంది. దీని బట్టి.. హిమాచల్​ ప్రదేశ్​లో ఎన్నికల వేడి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

అందుకే ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకు అభ్యర్థుల్లో కాస్త భయం ఉంటూనే ఉంటుంది!

పోలింగ్​ కోసం ముమ్మర ఏర్పాట్లు..

Himachal Pradesh election date 2022 : ఇక ప్రస్తుత ఎలక్షన్​ కోసం ఈసీ ముమ్మరం చర్యలు చేపట్టింది. పోలింగ్​ కోసం 7,884 కేంద్రాలను ఏర్పాటు చేసింది. 50,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను పోలింగ్​ కోసం విధుల్లో మోహరించింది. ఈవీఎంలో లోపాలు లేకుండా చూసుకుంది. పోలింగ్​ ప్రారంభానికి కొన్ని గంటల ముందు.. వివిధ కేంద్రాల్లో ఈవీఎంల మాక్​ పోలింగ్​ ప్రక్రియ జరిగింది.

హిమాచల్​ ప్రదేశ్​లో మొత్తం మీద 55,92,828 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 28,54,945 మంది పురుషులు, 27,37,845 మంది మహిళలు ఉన్నారు. 18-19 ఏళ్ల ఓటర్లు 1.93లక్షల మంది ఉన్నారు.

తదుపరి వ్యాసం