తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Chatgpt Cash Offer: ‘‘బగ్ ను పట్టండి.. లక్షలు కొట్టండి’’- చాట్ జీపీటీ బంపర్ ఆఫర్

ChatGPT cash offer: ‘‘బగ్ ను పట్టండి.. లక్షలు కొట్టండి’’- చాట్ జీపీటీ బంపర్ ఆఫర్

HT Telugu Desk HT Telugu

08 January 2024, 18:59 IST

google News
  • ChatGPT cash offer: కృత్రిమ మేథపై పరిశోధనలు చేసే సంస్థ ఓపెన్ ఏఐ (OpenAI) ఔత్సాహికులకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది.  

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (AFP)

ప్రతీకాత్మక చిత్రం

ChatGPT cash offer: ఓపెన్ ఏఐ (OpenAI) కృత్రిమ మేథపై పరిశోధనలు చేసే సంస్థ. ఇది అమెరికాలోని సాన్ ఫ్రాన్సిస్కోలో ఉంది. ఈ సంస్థ రూపొందించిన చాట్ జీపీటీ (ChatGPT) ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.

OpenAI Bug Bounty Program: బగ్ ను పట్టండి.. లక్షలు కొట్టండి

తాజాగా, కృత్రిమ మేథపై పరిశోధనలు చేస్తున్న వారికి, చాట్ జీపీటీని వినియోగిస్తున్న వారికి చాట్ జీపీటీ (ChatGPT) సృష్టికర్త ‘ఓపెన్ ఏఐ (OpenAI)’ ఒక బంపర్ ఆఫర్ ను ఇచ్చింది. తాము రూపొందించిన చాట్ జీపీటీ (ChatGPT) వ్యవస్థలో లోపాలను, పొరపాట్లను, తప్పులను గుర్తించి, తమకు తెలియజేస్తే, 20 వేల డాలర్ల వరకు నగదు బహుమతి ఇస్తామని ఓపెన్ ఏఐ (OpenAI) ప్రకటించింది. బగ్ బౌంటీ ప్రొగ్రామ్ (Bug Bounty Program) పేరుతో ఈ క్యాష్ ప్రైజ్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ Bug Bounty Program కోసం ప్రత్యేకంగా ప్రముఖ బగ్ బౌంటీ ప్లాట్ ఫామ్ అయిన ‘బగ్ క్లౌడ్ (Bugcrowd)’ అనే సంస్థతో ఓపెన్ ఏఐ (OpenAI) ఒప్పందం కుదుర్చుకుంది.

OpenAI Bug Bounty Program: 200 డాలర్ల నుంచి 20 వేల డాలర్ల వరకు..

ఈ బగ్ బౌంటీ ప్రొగ్రామ్ (Bug Bounty Program)లో పాల్గొని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (artificial intelligence AI)కు సంబంధించిన చాట్ జీపీటీ (ChatGPT) వ్యవస్థలో లోపాలు గుర్తించిన వారికి 200 డాలర్ల నుంచి 20 వేల డాలర్ల వరకు ఇవ్వనున్నట్లు ఓపెన్ ఏఐ (OpenAI) ప్రకటించింది. సాధారణ బగ్ (Bug) ను గుర్తిస్తే, 200 డాలర్లు క్యాష్ ప్రైజ్ గా అందిస్తామని, బగ్ (Bug) తీవ్రత పెరుతుతున్న కొద్దీ.. క్యాష్ ప్రైజ్ వాల్యూ పెరుగుతుందని వెల్లడించింది. అత్యంత తీవ్రమైన, ప్రభావవంతమైన బగ్ (Bug) ను గుర్తిస్తే 20 వేల డాలర్లను అందజేస్తామని తెలిపింది.

OpenAI Bug Bounty Program: ఎవరైనా పాల్గొనవచ్చు..

ఈ బగ్ బౌంటీ ప్రొగ్రామ్ లో ఎవరైనా పాల్గొనవచ్చని ఓపెన్ ఏఐ (OpenAI) ప్రకటించింది. ఇప్పటికే తాము కృత్రిమ మేథ (artificial intelligence AI) పరిశోధనలో భారీగా పెట్టుబడులు పెడ్తున్నామని, అయినా, కృత్రిమ మేథ అనే సంక్లిష్ట సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నప్పుడు.. కొన్ని లోపాలు నెలకొనడం సహజమేనని బగ్ బౌంటీ ప్రొగ్రామ్ (Bug Bounty Program) గురించి వివరిస్తూ ఓపెన్ ఏఐ (OpenAI) తమ బ్లాగ్ లో వ్యాఖ్యానించింది. అందువల్ల, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏఐ రీసెర్చర్లు (AI researchers), ఏఐ ఔత్సాహికులు (AI enthusiasts), ఎథికల్ హ్యాకర్లు (ethical hackers), సెక్యూరిటీ రీసెర్చర్లు (security researchers) ఈ బగ్ బౌంటీ ప్రొగ్రామ్ (Bug Bounty Program) లో పాల్గొని బగ్స్ ను గుర్తించాలని కోరింది.

టాపిక్

తదుపరి వ్యాసం