మహిళ తలకు గాయం.. ‘కండోమ్ ప్యాక్’తో కట్టు కట్టిన వైద్యులు!
20 August 2022, 17:14 IST
- Madhya Pradesh viral news : ఓ మహిళ తలకు గాయమైంది. సాధారణంగా బ్యాండేజ్‌తో తలకు కట్టు కడతారు. కానీ మధ్యప్రదేశ్‌లో.. కండోమ్ ప్యాక్‌తో కట్టు కట్టారు. అసలేం జరిగిందంటే..
మహిళ తలకు గాయం.. కండోమ్ ప్యాక్‌తో కట్టు కట్టిన వైద్యులు!
Madhya Pradesh viral news : సాధారణంగా.. శరీరానికి గాయమైతే.. కాటెన్, బ్యాండేజ్‌తో కట్టు కడతారు డాక్టర్లు. కానీ ఓ మహిళ తలకు గాయమైతే.. బ్యాండేజ్ బదులు కండోమ్ ప్యాక్‌తో కట్టు కట్టారు!
మధ్యప్రదేశ్ మోరేనాలో జరిగింది ఈ ఘటన. ధర్మ్గఢ్లో నివాసముండే ఓ మహిళ తలకు గాయమైంది. రక్తం పోతుండటంతో ఆమె సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. ఆ సమయంలో అక్కడ డా. ధర్మేంద్ర రాజ్‌పూట్ ఉన్నారు. మహిళ తలకు కట్టు కట్టాలని, రక్తస్రావాన్ని ఆపేందుకు ఏదైనా తలకు పెట్టాలని వార్డ్ బాయ్‌కి సూచించారు ఆ వైద్యుడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఆ వార్డ్ బాయ్.. అతి తెలివి ప్రదర్శించాడు! తలకు కట్టు కడుతున్న సమయంలో.. బ్యాండేజ్లాగా పనికొస్తుందని.. కండోమ్ ప్యాక్‌ను దెబ్బ తగిలిన చోట పెట్టాడు. పూర్తిగా కట్టుకట్టేశాడు.
ఆ మహిళ గాయం తీవ్రంగా మారడంతో.. ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా ఆసుపత్రికి వెళ్లింది. అక్కడే అసలు విషయం బయటపడింది. కట్టును తొలగించి.. గాయాన్ని పరిశీలించాలని అనుకున్న వైద్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
Morena health care centre : కట్టును తొలగిస్తుండగా.. మహిళ తల నుంచి కండోమ్ ప్యాక్ జారిపడింది.
ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
మరోవైపు ఈ ఘటనను అధికారులు అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారు. కండోమ్ ప్యాక్‌ను తలకు కట్టిన వ్యక్తిని అధికారులు సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది.
ఆ మహిళ పేరు రేష్మ బాయి అని సమాచారం.