తెలుగు న్యూస్ / ఫోటో /
కొత్తగా పెళ్ళైన వారికి ‘వెడ్డింగ్ కిట్స్’ గిఫ్ట్.. అందులో కండోమ్స్, పిల్స్!
భారతదేశంలో జనన నియంత్రణ సవాళ్లతో కూడుకున్నఅంశం. భారత్ లాంటి పెద్ద దేశంలో జనన నియంత్రణ పథకాలను అమలు చేయడం అంత తేలికైన విషయం కాదు. ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం ఓ వింత నిర్ణయం తీసుకుంది.
భారతదేశంలో జనన నియంత్రణ సవాళ్లతో కూడుకున్నఅంశం. భారత్ లాంటి పెద్ద దేశంలో జనన నియంత్రణ పథకాలను అమలు చేయడం అంత తేలికైన విషయం కాదు. ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం ఓ వింత నిర్ణయం తీసుకుంది.
(1 / 5)
కొత్తగా పెళ్లయిన జంటలకు రాష్ట్ర ప్రభుత్వం ఇక నుంచి బహుమతులు ఇవ్వబోతోంది. బహుమతి కిట్‌లో గర్భనిరోధక మాత్రలు, కండోమ్‌లు ఉంటాయి. కుటుంబ నియంత్రణ పద్ధతులు, సురక్షితమైన సెక్స్ అవగాహన కోసం ఓ పుస్తకం కూడా అందించబడుతుంది. కండోమ్‌ల వల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా ఈ పుస్తకంలో వివరిస్తారు.(Reuters)
(2 / 5)
జనన రేటును నియంత్రించేందుకు నూతన వధూవరులకు ఈ 'వెడ్డింగ్ కిట్'ని ఆశ కార్యకర్తలు అందించనున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఒడిశా ప్రభుత్వం ఈ 'బహుమతి' ఇవ్వనుంది. నూతన వధూవరులకు కిట్ ఎలా ఇవ్వాలనే దానిపై ఆశా వర్కర్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు.
(3 / 5)
ఒడిశాలోని నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ షాలినీ పండిట్ మాట్లాడుతూ దేశంలోనే ఇలాంటి కార్యక్రమం ఇదే మొదటిదని అన్నారు. జిల్లా, బ్లాక్ స్థాయి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. ఈ బహుమతుల పంపిణీ జాతీయ ఆరోగ్య మిషన్ 'నోయి పహల్' ప్రాజెక్ట్‌లో భాగమని తెలిపారు
(4 / 5)
కొత్తగా పెళ్లయిన జంటలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఒడిశా జననాల రేటు చాలా తక్కువగా ఉన్నప్పటికీ. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అందర్ని ఆశ్చర్యం కలిగించింది. ఒడిశాలో మొత్తం జనన రేటు 1.8 ఉంది, ఇక్కడ జాతీయ సగటులొ ఇది రెండు శాతం
ఇతర గ్యాలరీలు