Massive hike in US visa fees!: భారీగా పెరగనున్న అమెరికా వీసా ఫీజు
07 January 2023, 22:31 IST
Massive hike in US visa fees!: అమెరికా వెళ్లాలనుకునే వారికి భారీ షాక్. వీసా ఫీజులను భారీగా పెంచాలని అమెరికా భావిస్తోంది. హెచ్ 1 బీ(H-1B) సహా పలు కేటగిరీల వీసా ఫీజును దాదాపు రెండింతలు చేయాలన్న యోచనలో ఉంది.
ప్రతీకాత్మక చిత్రం
Massive hike in US visa fees!: ఇమిగ్రేషన్ సర్వీసుల ఫీజులను భారీగా పెంచే దిశగా అమెరికా ప్రభుత్వం ఆలోచిస్తోంది. భారతీయ టెకీల డ్రీమ్ వీసా హెచ్ 1 బీ(H-1B) సహా పలు కేటగిరీల వీసా దరఖాస్తు ఫీజులను భారీగా పెంచడానికి US Citizenship and Immigration Services (USCIS) ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
Massive hike in US visa fees!: 780 డాలర్లు..
ప్రతిపాదిత నిబంధనల ప్రకారం అమెరికా లోని కంపెనీలు విదేశీ నిపుణులైన ఉద్యోగులకు తమ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పించే హెచ్ 1 బీ వీసా (H-1B) దరఖాస్తు ఫీజును 460 డాలర్ల నుంచి 780 డాలర్లకు పెంచనున్నారు. అలాగే, ఎల్ 1 (L-1 visa) వీసా అప్లికేషన్ ఫీజును 460 డాలర్ల నుంచి ఏకంగా 1,385 డాలర్లకు పెంచే ఆలోచనలో ఉన్నారు. హెచ్ 2 బీ (H-2B visa) వీసా దరఖాస్తు ఫీజును 460 డాలర్ల నుంచి 1080 డాలర్లకు పెంచనున్నారు. ఓ 1 (O-1 visa) వీసా అప్లికేషన్ ఫీజును 460 డాలర్ల నుంచి 1055 డాలర్లకు పెంచే ప్రతిపాదనను సిద్ధం చేశారు. అలాగే, ఈ ముసాయిదా నిబంధనల ప్రకారం.. ఆయా కేటగిరీల ప్రీమియం వీసా (premium visa) ఫీజులో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు ఉండబోదు. ప్రస్తుతం ఈ ప్రతిపాదిత నిబంధనలను ప్రజల ముందుంచారు. వారి నుంచి సలహాలు, సూచనలు పొందిన అనంతరం, 60 రోజుల తరువాత, అవసరమైన మార్పులు చేసి, అమల్లోకి తీసుకువస్తారు.
Massive hike in US visa fees!: వ్యతిరేకత కూడా..
వీసా దరఖాస్తు ఫీజును భారీగా పెంచాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకత కూడా భారీగానే వ్యక్తమవుతోంది. చట్టబద్ధంగా అమెరికాలోకి అడుగుపెట్టాలనుకునే వారికి ఈ ఫీజులు ప్రతికూలంగా మారుతాయని, నిపుణులైన ఉద్యోగులు అమెరికాలోకి రాకుండా అడ్డుకుంటాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇమిగ్రేషన్ సర్వీసుల నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగిన నేపథ్యంలో, వీసా దరఖాస్తుల ఫీజులను పెంచాల్సి వస్తోందని USCIS చెబుతోంది. తద్వారా మరింత మెరుగైన, వేగవంతమైన సేవలను అందించడానికి వీలవుతుందని వివరిస్తోంది.
టాపిక్