Record student visas from US:ఈ ఏడు యూఎస్ జారీ చేసిన స్టుడెంట్ వీసాలెన్నో తెలుసా?-state processed record student visas this year us consul general mike hankey ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Record Student Visas From Us:ఈ ఏడు యూఎస్ జారీ చేసిన స్టుడెంట్ వీసాలెన్నో తెలుసా?

Record student visas from US:ఈ ఏడు యూఎస్ జారీ చేసిన స్టుడెంట్ వీసాలెన్నో తెలుసా?

HT Telugu Desk HT Telugu
Dec 21, 2022 09:57 PM IST

Record student visas from US: ఈ సంవత్సరం అమెరికా భారతీయ విద్యార్థులకు రికార్డు స్థాయిలో స్టుడెంట్ వీసాలను జారీ చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

US Student visas: ఈ సంవత్సరం భారతీయ విద్యార్థులకు స్టుడెంట్ వీసాలను జారీ చేసే విషయంలో అమెరికా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు భారతీయ విద్యార్థులకు అమెరికా అత్యధికంగా స్టుడెంట్ వీసాలను జారీ చేసిన సంవత్సరంగా 2022 నిలిచింది.

US Student visas: ఆల్ టైమ్ హై..

2022లో అమెరికా భారతీయ విద్యార్థులకు అత్యధికంగా 1.22 లక్షల స్టుడెంట్ వీసాలను జారీ చేసింది. అమెరికా నుంచి స్టుడెంట్ వీసాలను అత్యధికంగా పొందిన దేశాల్లో ఇండియా 2022లో తొలిస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని బుధవారం గోవాలో అమెరికా కాన్సుల్ జనరల్ మైక్ హ్యాంకీ వెల్లడించారు. మూడు కేటగిరీల వీసాలకు ప్రాధాన్యత ఇచ్చామని, అందులో స్టుడెంట్ వీసా కేటగిరీకి తొలి ప్రాధాన్యత ఇచ్చామని వివరించారు. తరువాత మెడికల్ అవసరాల కోసం వచ్చేవారికి ఇచ్చే వీసా, బిజినెస్ వీసా కేటగిరీలు ఉన్నాయన్నారు. అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు అత్యంత ప్రతిభావంతులని కాన్సుల్ జనరల్ కొనియాడారు. అమెరికాలో ప్రస్తుతం కనీసం 2 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు.

US Consul General meets Goa businessmen: గోవా బిజినెస్ మెన్ కోసం..

అమెరికా కాన్సుల్ జనరల్ అధికారిక కార్యక్రమాల్లో భాగంగా ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్నారు. బుధవారం గోవాలోని రాజకీయ నాయకులు, ఎన్ జీ ఓలు, ప్రభుత్వ అధికారులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. భారతీయులకు వీసాలు జారీ చేయడం కోసం ప్రత్యేకంగా అదనపు సిబ్బందిని, అదనపు బ్యాక్ ఎండ్ కేంద్రాలను నియమించామన్నారు. గోవాలోని వ్యాపారవేత్తలు, అమెరికాలోని కంపెనీల మధ్య వ్యాపార, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా అమెరికా చర్యలు తీసుకుంటోందన్నారు. వాణిజ్య నౌకల సిబ్బంది తదితరులకు వీసాలను జారీ చేసే విషయంలో జరుగుతున్న జాప్యాన్ని త్వరలోనే అరికడ్తామన్నారు.

Whats_app_banner

టాపిక్