తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Gujarat Assembly Elections : 16 సీట్ల కోసం నాలుగు పార్టీల పోరాటం.. గెలుపెవరిది?

Gujarat assembly elections : 16 సీట్ల కోసం నాలుగు పార్టీల పోరాటం.. గెలుపెవరిది?

04 December 2022, 12:27 IST

  • Gujarat assembly elections : గుజరాత్​ ఎన్నికల రెండో దశ పోలింగ్​ సోమవారం జరగనుంది. ఈ నేపథ్యంలో 16 సీట్లు హాట్​టాపిగ్​గా మారాయి.

అహ్మదాబాద్​లో పోలింగ్​ కోసం ఏర్పాట్లు
అహ్మదాబాద్​లో పోలింగ్​ కోసం ఏర్పాట్లు (PTI)

అహ్మదాబాద్​లో పోలింగ్​ కోసం ఏర్పాట్లు

Gujarat assembly elections : గుజరాత్​ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్​పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా అహ్మదాబాద్​లోని 16 సీట్లు ఇప్పుడు హాట్​టాపిక్​గా మారాయి. వాటిని మరోమారు దక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుంటే.. మెరుగైన ప్రదర్శన చేసేందుకు కాంగ్రెస్​ తహతహలాడుతోంది. ఈ రెండు పార్టీలతో పాటు ఆమ్​ ఆద్మీ, ఏఐఎంఐఎంలు కూడా బరిలో దిగాయి.

ట్రెండింగ్ వార్తలు

CBSE Class 12 Result 2024: సీబీఎస్ఈ 12వ తరగతి మార్కుల వెరిఫికేషన్ కు రిజిస్ట్రేషన్ ప్రారంభం

Bihar crime news : కస్టడీలో దంపతులు మృతి.. ప్రజల ఆగ్రహానికి తగలబడిన పోలీస్​ స్టేషన్​!

Haryana bus accident : బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి- 24 మందికి గాయాలు!

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

16 సీట్లు.. 4 పార్టీలు..

అహ్మదాబాద్​ అర్బన్​లోని 16 సీట్లు బీజేపీకి చాలా కీలకంగా మారాయి. 1990 నుంచి ఇక్కడ పోటీ బీజేపీ, కాంగ్రెస్​ మధ్యే ఉండేది, గెలుపు కమలదళంవైపే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి! ఆమ్​ ఆద్మీ, ఏఐఎంఐఎం కూడా బరిలో దిగి.. పోటీని మరింత రసవత్తరంగా మార్చాయి.

Gujarat assembly elections 2nd phase : ఈ 16 సీట్లల్లో ప్రస్తుతం బీజేపీ వద్ద 12 స్థానాలు ఉన్నాయి. 2012లో కేవలం రెండు సీట్లే దక్కించుకున్న కాంగ్రెస్​.. 2017 ఎన్నికల్లో నాలుగు స్థానాలను వెనకేసుకుంది. ఇక ఇప్పుడు, బీజేపీ, కాంగ్రెస్​, ఆమ్​ అద్మీ పార్టీలు.. అన్ని స్థానాల్లో పోటీకి దిగాయి. ఏఐఎంఐఎం మాత్రం నాలుగు సీట్లల్లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం.. ఈ 16సీట్లల్లో ఈసారి కూడా బీజేపీదే పైచేయి! ఆప్​ అంత ప్రభావం చూపకపోవచ్చు. కాంగ్రెస్​ ఓట్లు మాత్రం.. ఏఐఎంఐఎం చీల్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే.. బీజేపీకి లాభం చేకూరుతుంది.

బీజేపీ ప్రత్యేక శ్రద్ధ..!

Gujarat assembly elections BJP : గుజరాత్​లో ఎన్నికలను ఎప్పుడూ ప్రతిష్ఠాత్మకంగా భావించే కమలదళం.. ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఈ 16 సీట్లపై బీజేపీకి చాలా పట్టు ఉంది. కొన్ని.. బీజేపీకి కంచుకోటల్లాగా కూడా ఉన్నాయి. అయినప్పటికీ.. కమలదళం ఎక్కడా అశ్రద్ధ వహించలేదు. ముఖ్యంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. తన సొంత రాష్ట్రంలో భారీ స్థాయిలో ప్రచారాలు చేశారు. డిసెంబర్​ 1,2 తేదీల్లో రికార్డు స్థాయి రోడ్​షోను నిర్వహించి ప్రత్యర్థులను ఆశ్చర్యపరిచారు. మొత్తం మీద అహ్మదబాద్​లోని 13 నియోజకవర్గాలను ఈ రోడ్​షో చుట్టేసింది. మోదీని చూసేందుకు లక్షలాది మంది ప్రజలు తరలివెళ్లారు.

2002-2014 మధ్యలో గుజరాత్​లోని మనీనగర్​ నుంచి అసెంబ్లీకి వరుసగా మూడుసార్లు ఎన్నికయ్యారు మోదీ.ఈ ప్రాంతం.. బీజేపీకి కంచుకోటగా ఉంది. మనీనగర్​తో పాటు పటీదారులు ఎక్కువగా ఉండే ఘట్లోడియా నియోజకవర్గం కూడా ఈ 16 సీట్లల్లో కీలకంగా ఉన్నాయి. ఘట్లోడియాతో పాటు థక్కర్​బాపా నగర్​, సబర్మతి, మనీనగర్​, నికోల్​, నరోడా ప్రాంతాలపై పటీదారులకు పట్టు ఉంది. జమల్​పూర్​-ఖాడియా, దరియాపూర్​ సీట్లను ముస్లిం ఓటర్లు ప్రభావితం చేయగలరు. వెజల్​పూర్​, ధనిలిమ్డ(ఎస్​సీ) నియోజకవర్గాల్లోనూ ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.

182 అసెంబ్లీ సీట్లున్న గుజరాత్​లో తొలి దశ పోలింగ్​ డిసెంబర్​ 1న ముగిసింది. సోమవారం రెండో దశ పోలింగ్​ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. రెండో దశలో 89 సీట్లు పోలింగ్​కు వెళ్లనున్నాయి. ఎన్నికల ఫలితాలు ఈ నెల 8న వెలువడనున్నాయి.

తదుపరి వ్యాసం