తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Gujarat Polls Analysis: ఈ గుజరాత్ ఎన్నికల్లో కీలకమైన పటీదార్ల ఓటు ఎటు?

Gujarat polls analysis: ఈ గుజరాత్ ఎన్నికల్లో కీలకమైన పటీదార్ల ఓటు ఎటు?

03 December 2022, 15:30 IST

  • Gujarat polls analysis: గుజరాత్ లో డిసెంబర్ 5న రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలతో గుజరాత్ లో పోలింగ్ ముగుస్తుంది. అయితే, గుజరాత్ లో ప్రభావశీల సామాజిక వర్గమైన పటేల్ లేదా పటీదార్లు ఈ సారి ఎటువైపు ఉన్నారనేది ఆసక్తికరంగా మారింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Gujarat polls analysis: గత ఎన్నికల్లో 182కి గానూ కనీసం 150 స్థానాలు గెలుచుకుంటామన్న బీజేపీ విశ్వాసాన్ని పటీదార్లు(Patidar Community) దారుణంగా దెబ్బతీశారు. తమ కోటా ఉద్యమాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించిన బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కు మద్దతిచ్చి, ఆ పార్టీ 77 సీట్లు గెలుచుకునేలా చేశారు. చావు తప్పి కన్ను లొట్టబోయిన బీజేపీ ఆ ఎన్నికల్లో 99 సీట్లు సాధించి, స్వల్ప మెజారిటీతో గట్టెక్కింది.

Powerfull Patidar Community: పవర్ ఫుల్ సామాజిక వర్గం

గుజరాత్ జనాభాలో పటీదార్లు(Patidar Community) దాదాపు 18% వరకు ఉంటారు. అలాగే, మొత్తం 182 నియోజకవర్గాల్లో కనీసం 50 నియోజకవర్గాల్లో వారు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తారు. సామాజికంగా క్రియా శీల పాత్ర పోషించే పటీదార్లు సంప్రదాయంగా బీజేపీ మద్ధతుదారులే కానీ.. గత ఎన్నికల్లో మాత్రం కాషాయ పార్టీని చావుదెబ్బ కొట్టారు. దాంతో, గుణపాఠం నేర్చుకున్న బీజేపీ, పటీదార్ సామాజిక వర్గానికి(Patidar Community) చెందిన భూపేంద్ర పటేల్ కు ముఖ్యమంత్రి పీఠం అప్పగించింది. ఎన్నికల తరువాత కూడా భూపేంద్ర పటేలే సీఎం గా కొనసాగుతారని హామీ ఇచ్చింది. ప్రధాని మోదీ కూడా ఢిల్లీలో ఇటీవల జరిగిన పటీదార్ సమాజిక వర్గ(Patidar Community) సమావేశానికి హాజరై, వారికి మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేశారు.

BJP, Cong, AAP tickets to patidars: ఎంతమందికి టికెట్లు?

ఈ సారి ఎన్నికల్లో పటేల్ సామాజిక వర్గానికి అన్ని పార్టీలు పెద్ద పీట వేశాయి. బీజేపీ(BJP) ఈ సమాజిక వర్గానికి చెందిన 41 మందికి టికెట్లు ఇస్తే, కాంగ్రెస్ 40 మందికి ఇచ్చింది. ఈ ఎన్నికల్లో బలమైన పోటీ ఇస్తున్న ఆప్ కూడా పటీదార్ల(Patidar Community) ను గణనీయ సంఖ్యలోనే బరిలో నిలిపింది. 2017 ఎన్నికల్లో అన్ని పార్టీలకు కలిపి పటీదార్ సామాజిక వర్గానికి చెందిన 44 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. గుజరాత్ లో సౌరాష్ట్ర ప్రాంతంలోని మొర్బి, తంకారా, గొండల్, ధొరాజీ, అమ్రేలి, సావర్కుండ్ల, జెట్పూర్, రాజ్ కోట్ ఈస్ట్, రాజ్ కోట్ వెస్ట్, రాజ్ కోట్ సౌత్ నియోజక వర్గాల్లో పటీదార్ ఓటర్లు విజేతను నిర్ణయించే స్థాయిలో ఉన్నారు. అలాగే, ఉత్తర గుజరాత్ లోని విజాపూర్, విస్నగర్, ఉన్ఝా, మెహసనాల్లో, అలాగే అహ్మదాబాద్ లోని ఘట్లోడియా, సబర్మతి, మనినగర్, నికోల్, నరోదాల్లో పటీదార్లు(Patidar Community) గణనీయ సంఖ్యలో ఉన్నారు. దక్షిణ గుజరాత్ లో సూరత్, వరచ్చ, కామ్రేజ్, కటర్గ స్థానాలు పటీదార్లకు పట్టున్న స్థానాలు.

2017 ELECTION RESULT: 2017లో ఏం జరిగింది?

పటీదార్లను ఓబీసీల్లో చేర్చాలని గుజరాత్ లో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. హార్ధిక్ పటేల్(Hardik Patel) పటీదార్ల నయా నేతగా అవతరించారు. ఆ ఉద్యమాన్ని బీజేపీ(BJP) అణచివేయడానికి ప్రయత్నించింది. 2017 ఎన్నికల సమయంలో హార్ధిక్ పటేల్(Hardik Patel) రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి, బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. పటీదార్లలోనూ బీజేపీ(BJP)పై వ్యతిరేకత పెరిగింది. మరోవైపు, మునిగిపోతున్న నావ వంటి కాంగ్రెస్ ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మల్చుకుంది. పటీదార్ల(Patidar Community) మద్దతు సంపాదించడంలో సఫలమైంది. దాంతో, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్యంగా 77 సీట్లు సాధించగలిగింది.

Situation in 2022: 2022 పరిస్థితి ఏంటి?

అయితే, 2022 నాటికి పరిస్థితి మారింది. ఉద్యమ సమయం నాటి హార్ధిక్ పటేల్(Hardik Patel) వంటి నేతలు తెరమరుగయ్యారు. వారి పాత్ర, ప్రభావంతో పాటు ఉద్యమ ప్రభావం కూడా కనిష్ట స్థాయికి చేరింది. మరోవైపు, పటీదార్లను(Patidar Community) మళ్లీ తమవైపు తిప్పుకోవడానికి బీజేపీ(BJP) అన్ని చర్యలు చేపట్టింది. పటీదార్ నేత భూపేంద్ర పటేల్ ను సీఎం చేసింది. ఎన్నికల తరువాత కూడా ఆయననే కొనసాగిస్తామని హామీ ఇచ్చింది. గరిష్ట సంఖ్యలో పటీదార్లకు(Patidar Community) టికెట్లు కేటాయించింది. దాంతో, మెజారిటీ పటీదార్లు మళ్లీ బీజేపీ వైపు వెళ్లారు.

AAP impact: ఆప్ ప్రభావం ఏంటి?

పటీదార్ సామాజిక వర్గానికి ఆప్(AAP) గణనీయ స్థాయిలోనే సీట్లు కేటాయించింది. బీజేపీకి తామే ప్రత్యామ్నాయమన్న భావనను బీజేపీ వ్యతిరేక గుజరాత్ ఓటర్లలో తీసుకురాగలిగింది. ప్రచారంలోనూ సర్వ శక్తులు ఒడ్డింది. అయితే, పటీదార్ల(Patidar Community)లో యువత మాత్రం ఆప్(AAP) వైపు మళ్లిందని గుజరాత్ రాజకీయాలను దగ్గరగా పరిశీలిస్తున్న విశ్లేషకులు భావిస్తున్నారు. వారి విశ్లేషణ ప్రకారం.. సాధారణంగా, పటీదార్ సామాజిక వర్గానికి(Patidar Community) చెందిన నేత బరిలో ఉంటే, పార్టీలకు అతీతంగా వారు ఆ అభ్యర్థికే ఓటేస్తారు. ఈ ఎన్నికల్లోనూ ఆ ట్రెండ్ కొనసాగుతుంది. అయితే, ఒకవేళ, ప్రధాన పార్టీలు ఆ సామాజిక వర్గానికే టికెట్ ఇస్తే, అంటే, ప్రధాన ప్రత్యర్థులిద్దరూ పటీదార్ వర్గానికే చెందినవారైతే, ఈ ఎన్నికల్లో పటీదార్లు(Patidar Community) బీజేపీ(BJP) అభ్యర్థికే ఓటేసే అవకాశముంది. ప్రస్తుత ఎన్నికల్లో దాదాపు 30 నియోజకవర్గాల్లో ప్రధాన ప్రత్యర్థులుగా పటీదార్లే ఉన్నారు.

Quota leaders: కోటా నేతలు ఎక్కడ?

పటీదార్ల ఉద్యమం(Patidar Quota movement)తో జాతీయ స్థాయి నేతగా ఎదిగిన హార్ధిక్ పటేల్((Hardik Patel)) మొదట కాంగ్రెస్ లో చేరారు. ఆ తరువాత కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్లారు. ప్రస్తుతం విరంగం స్థానం నుంచి బీజేపీ(BJP) టికెట్ పైబరిలో ఉన్నారు. పటీదార్ ఉద్యమానికి చెందిన నాయకులు అల్పేశ్(Alpesh), గోపాల్ ఇటాలియా(Gopal Italia), ధార్మిక్ మాలవీయ ప్రస్తుతం ఆప్ లో ఉన్నారు. ఆప్(AAP) తరఫున వరుసగా వరచ్ఛ, కటర్గం, సూరత్ లోని ఓల్పాడ్ ల నుంచి పోటీ చేస్తున్నారు. మరో కోటా నేత రేష్మీ పటేల్ కూడా ప్రస్తుతం ఆప్ లోనే ఉన్నారు.

తదుపరి వ్యాసం