Telugu News  /  National International  /  Gujarat Elections Pm Narendra Modi To Lead Longest Roadshow Ever
PM Modi Longest Roadshow: నేడు గుజరాత్‍లో ప్రధాని మోదీ సుదీర్ఘ రోడ్‍షో
PM Modi Longest Roadshow: నేడు గుజరాత్‍లో ప్రధాని మోదీ సుదీర్ఘ రోడ్‍షో (BJP Gujarat Twitter)

PM Modi Longest Roadshow: నేడు ప్రధాని మోదీ సుదీర్ఘ రోడ్‍షో.. చరిత్రలో నిలిచిపోయేలా!

01 December 2022, 10:54 ISTChatakonda Krishna Prakash
01 December 2022, 10:54 IST

Gujarat Elections - PM Modi Roadshow: గుజరాత్‍లో ప్రధాని నరేంద్ర మోదీ నేడు సుదీర్ఘ రోడ్‍షోలో పాల్గొనున్నారు. ఏకంగా 16 నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ప్లాన్ చేసింది బీజేపీ.

Gujarat Elections 2022 - PM Modi Roadshow: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మళ్లీ అడుగుపెట్టనున్నారు. రెండు విరామం తర్వాత మళ్లీ సొంత రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీ (BJP) తరఫున ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. నేడు (డిసెంబర్ 1) ఏకంగా 50 కిలోమీటర్ల పాటు రోడ్ షో నిర్వహించనున్నారు. ఒక రోడ్ షో ఇంత సుదీర్ఘంగా జరగడం ఇదే తొలిసారి కానుంది. చరిత్రలో నిలిచిపోయేలా ఈ రోడ్‍షోను ప్లాన్ చేసింది బీజేపీ. గుజరాత్‍లో నేడు తొలి విడత పోలింగ్ జరుగుతుండగా.. రెండో విడత పోలింగ్ జరగనున్న నియోజకవర్గాల మీదుగా మోదీ రోడ్‍షో సాగనుంది.

ట్రెండింగ్ వార్తలు

50 కిలోమీటర్లు.. 16 నియోజకవర్గాలు

Gujarat Elections 2022 - PM Modi Roadshow: మోదీ పాల్గొనే 50 కిలోమీటర్ల సుదీర్ఘ ర్యాలీ నరోదా గామ్‍లో మొదలుకానుంది. 16 నియోజకవర్గాల మీదుగా సాగి చివరికి గాంధీ నగర్ సౌత్‍లో ముగుస్తుంది.

నేటి మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రధాని మోదీ రోడ్‍షో మొదలయ్యే అవకాశం ఉంది. సాయంత్రం 6.30 గంటల వరకు కొనసాగుతుందని అంచనా. ఈ రోడ్‍షోలో ప్రధాని నరేంద్ర మోదీ కనీసం 35 చోట్ల ఆగుతారు. రోడ్‍షో జరిగే మార్గంలో ఉండే పండిట్ దిన్‍దయాళ్ ఉపాధాయ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్‍తో పాటు మరికొందరి ప్రముఖుల స్మారక చిహ్నాల వద్ద మోదీ కొన్ని నిమిషాల పాటు ఆగుతారని భావిస్తున్నారు.

Gujarat Elections 2022 - PM Modi Roadshow: ఠక్కర్‍బాపా నగర్, బాపూనగర్, నికోల్, అమ్రైవాడి, మణినగర్, దానిల్‍లిమ్డా, జామల్‍పుల్ ఖాడియా, ఎలిస్‍బ్రిడ్జ్, వేజల్‍పూర్, ఘట్లోడియా, నారన్‍పూర్, సబర్మతి.. ప్రధాని రోడ్‍షో జరిగే నియోజకవర్గాల లిస్టులో ఉన్నాయి.

ఘట్లోడియా నియోజకవర్గం నుంచి బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి భుపేంద్ర పటేల్ పోటీ చేస్తున్నారు. నేడు మోదీ రోడ్‍షో ఆ నియోజకవర్గం మీదుగా కూడా సాగనుంది. 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ కొనసాగారు. ఆ రాష్ట్రానికి సుదీర్ఘ సీఎంగా చరిత్ర సృష్టించారు.

తొలి దశ పోలింగ్

Gujarat First Phase Poll: గుజరాత్‍ అసెంబ్లీ ఎన్నికల్లో నేడు తొలి దశ పోలింగ్ మొదలైంది. 89 నియోజకవర్గాల్లో నేడు ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 8 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. ప్రజలు ఉదయం నుంచే భారీ సంఖ్యలో ఓట్లు వేసేందుకు వచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. సుమారు 2 కోట్ల మంది తొలి పోలింగ్‍లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

కాగా, 93 శాసన సభ స్థానాలకు రెండో దశ పోలింగ్ ఈనెల 5వ తేదీన జరుగుతుంది. ఫలితాలు 8వ తేదీన వెల్లడవుతాయి.

గుజరాత్‍లో బీజేపీ 27 సంవత్సరాలుగా అధికారంలో ఉంది. ఈసారి కాంగ్రెస్‍తో పాటు ఆమ్‍ఆద్మీ కూడా పోటీలోకి వచ్చింది. దీంతో మూడు పార్టీల ప్రధానంగా పోటీ ఉంది.