Gujarat Assembly elections : 20శాతం మంది అభ్యర్థులపై క్రిమినల్​ కేసులు.. టాప్​లో ఆప్​!-gujarat assembly elections nearly 20 of total candidates have criminal cases aap tops list ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Gujarat Assembly Elections Nearly 20% Of Total Candidates Have Criminal Cases, Aap Tops List

Gujarat Assembly elections : 20శాతం మంది అభ్యర్థులపై క్రిమినల్​ కేసులు.. టాప్​లో ఆప్​!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 29, 2022 11:57 AM IST

Gujarat Assembly elections : గుజరాత్​ ఎన్నికల కోసం 1,621మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వీరిలో 20శాతం మందిపై క్రిమినల్​ కేసులు ఉన్నాయి. 2017 ఎన్నికలతో పోల్చుకుంటే.. ఈసారి ఈ తరహా అభ్యర్థుల సంఖ్య పెరగడం గమనార్హం.

బీజేపీ ర్యాలీలో పాల్గొన్న మద్దతుదారులు
బీజేపీ ర్యాలీలో పాల్గొన్న మద్దతుదారులు (HT_PRINT)

Gujarat Assembly elections : గుజరాత్​ ఎన్నికల బరిలో నిలిచిన 1621 మంది అభ్యర్థుల్లో దాదాపు 20శాతం మంది నేర చరిత్ర ఉన్నవారే! మొత్తం 330మందిపై వివిధ క్రిమినల్​ కేసులు ఉన్నాయి. ఈ జాబితాలో ఆమ్​ ఆద్మీ పార్టీ టాప్​లో(61మంది) ఉంది. ఈ వివరాలను అసోసియేషన్​ ఫర్​ డెమొక్రటిక్​ రిఫార్మ్స్​(ఏడీఆర్​) ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

రేప్​లు.. మర్డర్​ కేసులు..

182 సీట్లున్న గుజరాత్​లో డిసెంబర్​ 1, 5వ తేదీల్లో పోలింగ్​ జరగనుంది. కాగా.. తొలి దశలోని 89సీట్లల్లో పోటీచేస్తున్న 167మంది అభ్యర్థులపై క్రిమినల్​ కేసులు ఉన్నాయి. రెండో దశలో.. 93స్థానాల్లో బరిలో దిగుతున్న 163మందికి నేర చరిత్ర ఉంది.

2017 ఎన్నికలతో పోల్చుకుంటే.. క్రిమినల్​ కేసులు ఉన్న అభ్యర్థుల సంఖ్య ఈసారి పెరిగింది. నాటి ఎన్నికల్లో మొత్తం మీద 238మందికి నేర చరిత్ర ఉంది. అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్​ను విశ్లేషించిన అనంతరం ఈ నివేదికను రూపొందించినట్టు ఏడీఆర్​ స్పష్టం చేసింది.

Gujarat elections candidates list : ఈ విషయంలో.. ఆప్​ తర్వాతి స్థానంలో కాంగ్రెస్​ నిలిచింది. మొత్తం మీద 60మంది కాంగ్రెస్​ అభ్యర్థులపై వివిధ కేసులు ఉన్నాయి. బీజేపీ.. మూడోస్థానంలో ఉంది. తమపై కేసులున్న 32మందికి టికెట్లిచ్చింది కమలదళం.

ఈ 330మంది అభ్యర్థుల్లో.. 192మందిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. మర్డర్​, రేప్​, హత్యాయత్నం వంటి కేసులు వీరిపై ఉన్నాయి. కాంగ్రెస్​, బీజేపీ, ఆప్​ నుంచి ఈ తరహా కేసులున్న వారి సంఖ్య 96. ఒక్క ఆప్​ నుంచే ఈ విధంగా 43మంది ఉన్నారు. కాంగ్రెస్​ నుంచి 28, బీజేపీ నుంచి 25మందిపై తీవ్రస్థాయి కేసులు ఉన్నాయి.

Gujarat election candidates with criminal cases : మహిళలపై నేరాలకు పాల్పడిన 18మంది కూడా ఈసారి బరిలో నిలిచారు. ఒకరిపై రేప్​ కేసు, ఐదుగురిపై మర్డర్​ కేసు, 20మందిపై హత్యాయత్నం కేసులు ఉండటం గమనార్హం. ఆప్​ తరఫున అహ్మదాబాద్​ జిల్లాలోని దస్క్​రాయ్​ సీటు నుంచి బరిలో దిగిన కిరన్​ పటేల్​పై మర్డర్​ కేసు ఉంది. కాంగ్రెస్​ నుంచ పతన్​ సీటు అభ్యర్థి కిరీట్​ పటేల్​పై అటెంప్ట్​ టు మర్డర్​ కేసు ఉంది. ఇక బీజేపీ నుంచి షేహ్ర సీటు అభ్యర్థి జేఠ భార్వడ్​పై అత్యాచారం, అపహరణ, మహిళలను కించపరిచే విధంగా ప్రవర్తించడం వంటి కేసులు ఉన్నాయి.

182 సీట్లున్న అసెంబ్లీకి.. ఆప్​ 181మందిని, కాంగ్రెస్​ 179మందిని, బీజేపీ 182మందిని రంగంలోకి దింపాయి.

సుప్రీం తీర్పు వృథా..!

Gujarat elections 2022 : ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు నేర చరిత్ర ఉంటే.. వారిని ఎంపిక చేయడానికి గల కారణాలను ప్రజల ముందు పెట్టాలని.. 2020 ఫిబ్రవరిలో తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. నేర చరిత్ర లేని వారికి టికెట్లు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని స్పష్టం చేసింది. కానీ.. తాజా పరిస్థితులను పరిశీలిస్తుంటే.. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు.. పార్టీలను ప్రభావితం చేయడం లేదని స్పష్టమవుతున్నట్టు ఏడీఆర్​ నివేదిక తేల్చింది.

డిసెంబర్​ 8న గుజరాత్​ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మరి నేర చరిత్ర కలిగిన అభ్యర్థులను ప్రజలు గెలిపిస్తారా? లేదా? అన్నది వేచిచూడాలి.

IPL_Entry_Point

సంబంధిత కథనం